Home / health / టూత్ బ్ర‌ష్‌, త‌ల దిండ్ల‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది.

టూత్ బ్ర‌ష్‌, త‌ల దిండ్ల‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది.

Author:

తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపే చాలా మంది తాము రోజు వాడే వస్తువులను నిర్ణీత కాలం కన్న ఎక్కువ రోజులు వాడడం వలనే జబ్బుల భారిన పడుతున్నారని ఒక అధ్యయనం వెల్లడించింది. తినే తిండి, పరిసరాలపై ఉన్న శ్రద్ధ వాడే వస్తువులపై ఉండటం లేదన్నది ఆ అధ్యయనం యొక్క సారాంశం. మీరు చివరి సారిగా మీ టూత్ బ్రష్ ఎప్పుడు మార్చారు అంటే చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. బ్రష్ మీద ఉన్న ముళ్ళ వెంట్రుకలు అరిగి పోతే కాని కొత్త బ్రష్ కొనరు చాలా మంది. బ్రష్ కాకుండా మనం నిత్యం ఉపయోగించే చాలా వస్తువులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. మేము చెబుతున్న ఎక్స్‌పైరీ డేట్ వస్తువు బాక్స్ మీదా రాసిన నిర్ణీత గడువు కాదు, ఒకసారి ఆ వస్తువుని ఉపయోగించడం మొదలు పెట్టాక ఎన్ని రోజులు ఆ వస్తువుని వాడొచ్చో ఆ గడువు గురించి.

expiry date of tooth brush

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నిత్యం వాడే టూత్ బ్రష్ ని సగటున మూడు నెలలకు ఒకసారి మార్చాలి కాని కొంతమంది మహానుభావులు నెలలు కాదు సంవత్సరాల తరబడి ఒకటే బ్రష్ వాడుతుంటారు. అలా వాడటం వలన మీ దంతాలను రక్షించాల్సిన మీ టూత్ బ్రష్ అవే దంతాలకు హానీ చెస్తుందని దంత వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాకుండా రాత్రి నిద్రకు సహకరించే తల దిండులు, దుప్పట్లు తరచుగా మార్చడంలో అలసత్వం వలన చాలా మంది జబ్బుల భారిన పడుతున్నారు. మార్కెట్ లో దొరుకుతున్న వివిధ రకాల తల దిండులు వాడుతున్న వారు తాము వాడే దిండును మ‌ధ్యలోకి మ‌డిచి వ‌ద‌లితే అది యాక్ష‌న్‌తో మళ్లీ వెన‌క్కి వ‌స్తే ఆ దిండు కండీషన్లో ఉన్నట్లు లెక్క కాని ఆ దిండుపై వేసే కవర్లు, దుప్పట్లు మాత్రం వారానికి రెండుసార్లైన మార్చాలని సూచిస్తున్నారు డాక్టర్లు, లేదంటే మ‌న శరీరం, త‌ల కింద నుంచి వ‌చ్చే చెమ‌ట‌, జుట్టులోని మృత క‌ణాలు, ఇత‌ర సెల్స్ తల దిండులోకి చేరి మ‌న‌కు అనారోగ్యాల‌ను క‌లిగిస్తాయి. ఇవే కాకుండా నిత్యం ధరించే లోదుస్తులు కూడా చిరిగిన దాక వాడకుండా క్రమం తప్పకుండా మార్చుతూ ఉండాలి.

(Visited 1,808 times, 1 visits today)