Home / Inspiring Stories / జీవితం గురుంచి చాణుక్యుడు చెప్పిన అద్భుతమైన నీతి కథ..! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!!

జీవితం గురుంచి చాణుక్యుడు చెప్పిన అద్భుతమైన నీతి కథ..! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!!

Author:

ఎవరైనా క్లిష్టమైన సమస్యని పరిష్కరిస్తే వారిని చాణిక్యుడిలా ఆలోచించావు అని పొగుడుతాం, భారత దేశ చరిత్రలో చాణిక్యుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఎలాంటి సమస్యని అయినా చాలా సులువుగా పరిష్కరించడంలో చాణిక్యుడిని మించిన వాళ్ళు లేరు అనేది మన పెద్దవాళ్ళు చెప్పే మాట, అన్ని సమస్యలు ఒకేసారి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చాణిక్యుడు ఒక కథ రూపంలో చెప్పాడు, ఈ కథ చదివితే జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది.

chanukya-inspiring-story

ఒకరోజు ఒక అడవిలో నిండు గర్భిణిగా డెలివెరీకి సిద్దంగా ఉన్న ఒక లేడి నొప్పులతో అడుగులు వేస్తూ అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతుండగా, ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది. అదే తనికి అనుకూలమైన ప్రదేశం అనుకుని అక్కడికి చేరింది. నొప్పులతో బిడ్డను ప్రసవించడానికి సిద్దంగా అటుఇటూ చూడగా, పిడుగులు పడి కొద్దిపాటి దూరంలో గడ్డి అంటుకుంది. లేడిని గమనించి ఇంకొక వైపు సింహం వస్తుంది. మరో వైపు వేటగాడు లేడిని చంపడానికి బాణం వేస్తున్నాడు. ఇంకో వైపు పారే నది. ఇలా నాలుగు వైపుల మృత్యువు వెంటాడతుంది.

ఇలాంటి సమయంలో లేడి ఏమి చెయ్యాలి, ఎటు వెళ్ళినా ప్రమాదమే. అయితే ఆ సమయంలో ఆ లేడి ఏమి చేసిందో తెలుసా? ఆ ప్రమాదాలను వేటిని పట్టించుకోకుండా తన బిడ్డను కనే పని మీదే దృష్టిపెట్టింది. అప్పుడు ఏమి జరిగిందంటే పిడుగుల కాంతి వేటగాడి కళ్ళకు తగిలి బాణం గురి తప్పి, సింహానికి తగిలి సింహం చనిపోయింది. ఇంతలో వర్షం పడి సమీపంలో ఉన్న మంటలు ఆగిపోయాయి. లేడిపిల్ల తల్లి గర్భం నుంచి బయటికి వచ్చింది. అన్ని ఒక్కసారిగానే జరిగాయి. దీనిని బట్టి మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే ఎన్ని సమస్యలు వచ్చినా మన పని మనం చేస్తూనే ఉండాలి గాని, నిరుత్సాహంతో ఆగిపోకూడదు. మన చేతిలో మన అందుబాటులో ఉన్నది మన సవ్యంగా, ధైర్యంగా చేస్తే మిగిలింది దేవుడు చూసుకుంటాడు.

Must Read: జీవితం గురుంచి ఆపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ చెప్పిన అద్భుతమైన నిజం..! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!!

(Visited 11,116 times, 1 visits today)