Home / Political / చీఫ్ మినిస్టర్ కి చీపులిక్కరాభిషేకం

చీఫ్ మినిస్టర్ కి చీపులిక్కరాభిషేకం

Author:

ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్య మంత్రి గారికి సన్మానం జరిగింది. అభిమానులు అభిషేకం కూడా చేసారు. కానీ ఎప్పుడూ చేసేలా పాలో, పెరుగో ఐతే స్పెషలేముంటదీ అందుకే చీప్ లిక్కర్తో అభిషేకం ప్లాన్ చేసారు. ఏకంగా మద్యం తోనే అభిషేకం చేసారు. ఎప్పుడు.? ఐనా మందాభిషేకానికి ఆయనెలా ఒప్పుకున్నారూ? అనుకుంటున్నారా. ముఖ్యమంత్రి గారికీ అంటే ఆయక్కాదులెండి ఆయన ఫొటోకి చేసారు.

చీప్ లిక్కర్ అమ్మకాన్ని తెలంగాణ ప్రభుత్వమే చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.  ఇప్పటికే మహిళా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ విషయంలో నిరసన తెలుపుతుండగా. మరో వైపు కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు కూడా.” డబ్బున్న వాడికే అన్ని సరదాలూ నా పేదవాడికి అందు బాటులో ఉంటే తప్పేంటి?” అంటూ కొందరు సీఎం కేసీఆర్ ని సమర్థిస్తూండగా. ” పేదవాడి మీద అంత ప్రేమ నిజమే ఐతే  గుడుంబాని నిషేదించి ప్రభుత్వమే మధ్యం అమ్మాలనుకుంటే అది తప్పని సరి అనిపిస్తే పెద్ద కంపెనీల మధ్యాన్ని అందుబాటులో ఉండేలా ధరలు తగ్గించాలి గానీ ప్రమాద కరమైన చీప్ లిక్కర్తో పేద ప్రజల ఆరోగ్యాన్నీ, డబ్బునీ దోచుకుంటే
ఎలా” అని మిగిలిన వాళ్ళూ ఘాటు గానే ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చలిలా సాగుతూండగానే చీప్ లిక్కర్ పై వెనక్కు తగ్గేది లేదని మరోసారి సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో నిరసనల ఉధృతి పెరుగుతోంది చర్చలనుంచి నిరసనల వైపు అడుగులు పడుతున్నాయి. ” మధ్యం వ్యతిరేకత ” మళ్ళీ ఒక పూర్తిస్తాయి ఉద్యమంగా  మారే అవకాశాలూ లేకపోలెదంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఆ పరిస్తితి మొదలైనట్టు కనిపిస్తోంది.

ప్రతి ఉధ్యమానికి తామే ముందుండే ఓ యూ విధ్యార్థులు చేసిన ర్యాలీ నే దీనికి నిదర్శనం. చీప్ లిక్కర్ ను ప్రభుత్వం అమ్మడాన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థులు కేసీఆర్ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద  కేసీఆర్ చిత్రపటానికి చీప్ లిక్కర్ సీసాలతో దండ వేసి అనంతరం లిక్కర్ తో అభిషేకం చేశారు. ఓయూ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ మాట్లాడుతూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడే విధానాలు ఏ ప్రభుత్వానికీ, ప్రజలకూ మంచివి కావనీ వెంటనే మధ్యం  ప్రతిపాదనను  ఉపసంహిరించుకోవాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు చీప్ లిక్కర్ తో చీప్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. ఎంతో మంది త్యాగాలు విద్యార్థులు తెలంగాణ ప్రజల ఉద్యమాలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ అబాసు పాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆదాయం కంటే ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలి కానీ డబ్బుకోసం ప్రజలకు విషాన్ని తాగిస్తారా ? అని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికే “మద్యం కాదు మందులు కావాలి ” అంటూ కొన్ని ఆసుపత్రుల ముందు బానర్లు కనిపిస్తుండగా. మరి కొందరు ఫేస్ బుక్  లాంటి సోషల్ మీడియాల్లో కూడా ప్రత్యేక  పేజీలను పెట్టి మరీ నిరసన తెలుపుతున్నారు. ఇదే పద్దతి కొనసాగితే మాత్రం కేసీఆర్ పై వ్యతిరేకత పెరుగుతుందనీ. అది ఆయన రాజకీయ భవిశ్యత్తు పై ప్రభావం చూపించే అవకాశమూ ఉందని హెచ్చరిస్తున్నారు రాజకీయ పండితులు.

(Visited 65 times, 1 visits today)