Home / Inspiring Stories / ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా?.. హుషారుగా ఉండండి!

ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా?.. హుషారుగా ఉండండి!

Author:

Petrol Bunk Bangalore Cheating

రోజు రోజుకి సమాజంలో మోసాలు ఎక్కువైపోతున్నయి, అసలే ప్రభుత్వం 25 రూపాయలకి వచ్చే పెట్రోల్ ని 65 రూపాయలకి అమ్ముతూ నెల నెల టాక్స్ పెంచుతూ సామాన్య ప్రజల పై భారం మోపుతుంది అని అందరు బాధపడుతుంటే ఇప్పుడు మరో రకమైన మోసం వెలుగు చూసింది.

బెంగుళూరు కి చెందినా వెంకటేష్ అనే వ్యక్తి తన కారులో పెట్రోల్ కొట్టించుకుందామని పెట్రోల్ బంక్ కి వెళ్ళాడు, ఫుల్ ట్యాంక్ చేయమని పెట్రోల్ పోసే కుర్రాడికి చెప్పాడు, వెంకటేష్ డబ్బులు తీద్దామని పర్సు తీసే లోపే ఆ కుర్రాడు పెట్రోల్ కొట్టడం ఆపేసాడు, రీడింగ్ 300 దగ్గర ఉంది గమనించిన వెంకటేష్ ఎందుకు అపేసావు అని అడిగాడు, కాని ఆ కుర్రాడు ఏమి సమాధానం చెప్పకుండా జీరో రీడింగ్ చేయకుండానే మళ్లీ పెట్రోల్ కొట్టడం మొదలు పెట్టాడు.

వెంకటేష్ అనుమానంతో రీడింగ్ నే చూస్తున్నాడు, బంక్ లో పని చేసే వేరే కుర్రాడు వచ్చి వెంకటేష్ దృష్టి మరల్చే ప్రయత్నం చేసాడు కాని వెంకటేష్ అవేమి పట్టించుకోలేదు. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించాక బిల్ ఇవ్వమన్నాడు, బిల్ చూస్తే 48.25 లీటర్ల కి 2300 రూపాయల బిల్ వేసారు, కాని వెంకటేష్ తన కార్ కెపాసిటీ 42 లీటర్లు మాత్రమే అయితే 48 లీటర్లు ఎలా కొట్టరంటు అడిగాడు, ఆ కుర్రాడు సరిగ్గా సమాధానం చెప్పకుండా బిల్ మెషిన్ పాడైడింది వాదించాసాగాడు, వెంకటేష్ కొంచెం గట్టిగా నిలదేసే సరికి అసలు మోసం బయటకు వచ్చింది. మేనేజర్ వచ్చి 42 లీటర్లకి 2000 అయినట్లు అసలు బిల్ ఇచ్చాడు, అని అతని మోసాన్ని వెంకటేష్ బయటపెట్టాడు.

ఆ పెట్రోలు బంకు మెయిన్ రోడ్డు మీద ఉంది ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఈ లెక్కన రోజుకి 20 మంది కస్టమర్లని మోసం చేస్తే, ఆ కుర్రాడి నెల సంపాదన ఎంత ఉంటుందో ఒక్కసారి ఊహించు కోండి! ఇలాంటి మోసపూరిత సంఘటనలు ఎన్నో! వినియోగ దారుల అప్రమత్తత గురించి ఒక హెచ్చరిక లాంటిదే ఈ సంఘటన. ఎప్పుడూ తమ కొచ్చే బిల్లులను చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఏదో కొద్ది అమౌంటే కదా అని చూసీ చూడనట్లు వదిలేస్తే అదొక వైరస్‌లా పాకుతుంది. కాబట్టి వినియోగదారులూ జాగ్రత్త! అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు బిల్లులు చెక్‌ చేసుకుంటూ ఉండండి.

Must Read:భారతదేశం లో విస్తరిస్తున్న క్యాన్సర్ వ్యాధి.

(Visited 18,783 times, 1 visits today)