Home / Inspiring Stories / 599 రూపాయలకే ఐఫోన్ అని ఆన్ లైన్లో ఆర్డర్ ఇచ్చాడు.

599 రూపాయలకే ఐఫోన్ అని ఆన్ లైన్లో ఆర్డర్ ఇచ్చాడు.

Author:

iphone

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా.. ? ఐతే వినియోగదారులూ కాస్త జాగ్రత్త పడండి. ఇటీవల కాలంలో ఆన్‌‌లైన్‌లో షాపింగ్ చేస్తున్న వారిని ఆయా వెబ్‌సైట్స్ మోసం చేస్తున్న విషయం తెలిసిందే. ఆతి తక్కువ ధరకే ఆన్ లైన్ లో దొరుకుతుంది కదా అని తొందరపడకండి ఎందుకంటే అలా తొందరపడే ఒక వ్యక్తి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు.

ఐఫోన్ ని కేవలం 599 రూపాయలకే ఇస్తాం అంటే గుడ్డిగా నమ్మి మోసపోయాడు పూణే కి చెందిన ఒక వ్యక్తి, 30 వేలు విలువ చేసే ఐఫోన్ కేవలం 599 రూపాయలకే సొంతం చేసుకోండి అనే యాడ్ ని ఒక వెబ్ సైట్ లో చూసి నిజమని నమ్మి ఆర్డర్ చేసాడు,ఇప్పుడు మోసపోయానని బాధపడుతున్నాడు, పూణెలోని కట్రాజ్‌‌కు చెందిన నారాయణ్ ఘడగే.. ఓ ప్రయివేటు ఉద్యోగి. 50 సంవత్సరాలు రాగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లోనే ఉంటున్నాడు. తన ఇంట్లో ఉన్నప్పుడు కంప్యూటర్‌లో నెట్ వినియోగిస్తూ ఉంటుంటాడు. అనుకోకుండా ఒకరోజు 599 రూపాయలకే ఐఫోన్ అనే ఆఫర్‌ను bigsop.com అనే వెబ్‌సైట్‌లో చూశాడు. వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆర్డర్ చేసి.. ఆన్‌లైన్ పేమెంట్ కూడా చేశాడు. డబ్బు చెల్లించిన ఓ గంట తర్వాత ఓ నెంబర్ నుంచి నారాయణ్‌కు ఫోన్ వచ్చింది. తాము ఈ-కామర్స్ నుంచి మాట్లాడుతన్నామనీ, ట్రాన్స్‌ఫర్ అయిన డబ్బు మీకు చెందినదో కాదో నిర్ధారించుకోవాల్సిన అవసరముందంటూ బ్యాంక్ అకౌంట్, ఏటీఎమ్ కార్డ్ పాస్‌వర్డ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇక రెండు,మూడు రోజుల్లో అతి తక్కువ ధరకే ఐఫోన్ తమ చేతిలోకి రానున్నదంటూ ఆ కుటుంబం పడిన ఆనందం కొద్దిసేపే మిగిలింది. ఆ రోజు అర్థరాత్రి సమయంలో ఆ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు నారాయణ్ సెల్‌కు మెసేజ్ వచ్చింది. ఆ విషయమై తనకు వచ్చిన ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి మాట్లాడగా… చూసి లోపం ఉంటే మీ ఖాతాలో జమచేస్తామంటూ నమ్మబలికారు. అలా రెండు రోజుల వ్యవధిలోనే లక్షా 98వేల 712 రూపాయల మొత్తాన్ని బ్యాంకు అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. దీంతో తాను మోసపోయినట్లు భావించిన నారాయణ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన 2014లో జరిగినా ముందుగా సైబర్‌క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం కానరాకపోవడంతో ఈ నెల రెండవ తారీఖున కొంధ్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Must Read:Video:పొట్ట తగ్గాలంటే విక్స్ వాడండి…!

(Visited 2,695 times, 1 visits today)