Home / health / మీ ఫోన్ ద్వారా మీరు కొన్న మందులు అసలైనవో నకిలీ వో తెలుసుకోవచ్చు.

మీ ఫోన్ ద్వారా మీరు కొన్న మందులు అసలైనవో నకిలీ వో తెలుసుకోవచ్చు.

Author:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కల్తీ మయమే. తినే అన్నం దగ్గర్నుంచి వాడే మందుల దాకా అన్నీ కల్తీ అయిపోతున్నాయి. అయితే మనం వాడే కొన్ని వస్తువులల్లో ఏది కల్తీయో? నిజమో? తెలుసుకోవచ్చు. కానీ, వాడే మందుల విషయం లో మనకు ఏది నకిలీ యో, ఏది మంచివో తెలీదు. మరి మనం ఆసుపత్రికి వెళ్లి, డాక్టర్ రాసిచ్చిన చీటీతో మందులు కొనుక్కొని వాడేస్తాం కానీ అవి అసలైనవో? నకిలీవో తెలీదు. అయితే ఈ మందులు కూడా నకిలీ అయితే గుర్తుపట్టవచ్చని ఔషధ రంగ నిపుణుడు డాక్టర్ త్రిలోక్ రావల్ చెబుతున్నారు. అదీ పెద్ద కష్టమేమీ కాదంట. సింపుల్ గా మూడే మూడు స్టెప్పుల్లో మనం వాడే మందులు మంచివో కావో తెలుసుకోవచ్చు.

medicine original or duplicate

ప్రతి మందుల స్ట్రిప్ వెనక భాగాన 9 అంకెలతో కూడిన ప్రత్యేకమైన నంబర్ ఒకటి ఉంటుంది. ఏ రెండు మందులకూ ఇది ఒకేవిధంగా ఉండదన్నమాట. ఈ తొమ్మిదంకెల నంబర్ ని 9901099010 అనే మొబైల్ నంబర్ కి మెసేజ్ చేస్తే చాలు. ఒక పది సెకన్లలో ఆ మొబైల్ నుంచి మనకు జవాబు వస్తుంది. ఒకవేళ ఆ మందు మంచిదైతే గనక ఆ మందుకు సంబ౦ధించిన ఫార్మా కంపెనీ పేరు, మందు తయారైన బ్యాచ్ నంబర్స్ తో సహా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లోని నంబర్లు మనం కొన్న మందుల స్ట్రిప్ నంబర్లు మ్యాచ్ అయితే అంతా ఓకే అని ఊపిరి పిల్చుకోవచ్చు. లేదంటే… నకిలీ మందులే అని గమనించాలి. అంతే కాదు, నకిలీ మందులు అనిపిస్తే మీ చేతులోని మందుల స్ట్రిప్ మీది బ్యాచ్ నంబర్లు, పేర్లను ఇదే నంబర్ కి మెసేజ్ చేసి ఆ సదరు నకిలీ మందుల తయారీ వారి మీద కంప్లైంట్ బుక్ చేయొచ్చు. తద్వారా ఆ నకిలీ తయారీ దారు మీద కేసు పెట్టొచ్చు. వేసుకునే ముందు మీరు కొన్న మందులు సరైనవో కావో చెక్ చేసుకోండి. కాబట్టి చాల జాగ్రత్తగా ఉండండి. అసలే మనం ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నాం. ఎక్కడైనా కల్తీ భరించచ్చేమో కానీ ఆరోగ్యం విషయంలో కల్తీ అయితే మన ప్రాణాలకే ముప్పు అనే విషయం గుర్తుంచుకోండి.

(Visited 962 times, 1 visits today)