Home / Reviews / చెలియా రివ్యూ & రేటింగ్.

చెలియా రివ్యూ & రేటింగ్.

Alajadi Rating

2.75/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: కార్తీ, అదితి రావు హైదరి, ల‌లిత‌,శ్ర‌ద్ధ శ్రీనాథ్‌, ఆర్.జె.బాలాజీ..తదితరులు

Directed by: మణిరత్నం

Produced by: మ‌ణిర‌త్నం, శిరీష్‌

Banner: మద్రాస్ టాకీస్

Music Composed by: ఎ.ఆర్‌.రెహమాన్‌

మణిరత్నం సినిమాలు అంటేనే అద్భుత దృశ్య‌కావ్యలు, అయన సినిమాలకి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఉన్నారు, ప్రేమకథలని అద్భుతంగా తీయడంలో మణిరత్నం శైలే వేరు,  గీతాంజ‌లి,`దిల్‌సే`, ‘రోజా’ `బొంబాయి`, `స‌ఖి`, `ఓకే బంగారం` చిత్రాల‌తో ఓ చ‌రిత్ర సృష్టించారు. తాజాగా మ‌రోసారి  ప్రేమ‌క‌థ‌తో చెలియా తీశారు. కార్తీ, అదితి రావు నటించిన చెలియా సినిమా ఈరోజు విడుదల అయింది, ఆ సినిమా ఎలా ఉందో మీరు తెలుసుకోండి.

కథ:

వరుణ్ అలియాస్ వీసీ (కార్తి) కాశ్మీర్లో ఇండియన్ ఏవియేషన్ ఫైటర్ పైలట్ గా పని చేస్తుంటాడు. అక్కడే డాక్టర్ గా పనిచేస్తుంటుంది లీలా (అదితి రావు హైదరి). ఒక ప్రమాదంలో గాయపడిన వీసీకి లీలా చికిత్స చేస్తుంది, ఆ తర్వాత ఇద్దరికి పరిచయం పెరిగి.. దగ్గరవుతారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోతారు. అదే సమయంలో యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో పాల్గొన్న వీసీ, శత్రు సైన్యానికి చిక్కుతాడు. యుద్ధ ఖైదీగా చిక్కి బంధించబడుతాడు,. మరి అక్కడి నుంచి అతను బయటపడ్డాడా..? తిరిగి తన ప్రేయసిని కలిశాడా..? అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సమస్య ఏమిటి..? అన్నది తెరమీదే చూడాలి.

అలజడి విశ్లేషణ:

సంఘ‌ర్ష‌ణ‌తో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌ని యుద్ధం నేప‌థ్యంతో ముడిపెట్టి తెరకెక్కించిన చిత్ర‌మిది. మ‌ణిర‌త్నం త‌న మార్క్ క‌థ‌, క‌థ‌నాలు, క్యారెక్ట‌రైజేష‌న్‌తో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. ప్ర‌తీ ఫ్రేమ్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఎ.ఆర్‌. రెహమాన్ సంగీతం ఆ స‌న్నివేశాల్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. ఒక సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌కి ద‌ర్శ‌కుడు మణిర‌త్నం యుద్ధం నేప‌థ్యాన్ని… ఫైట‌ర్ పైల‌ట్ పాత్ర‌ని ఎంచుకొన్నాడు. దాంతో ఈ క‌థ‌లో మ‌రింత సంఘ‌ర్ష‌ణతో సాగుతుంది. వ‌రుణ్ జైల్లోఉంటూ త‌న ప్రేయ‌సి లీలాతో ముడిప‌డ్డ జ్ఞాప‌కాల్నిగుర్తు చేసుకొంటుంటాడు. తొలి స‌గ‌భాగం స‌న్నివేశాల‌న్నీ లీలా, వ‌రుణ్ ప‌రిచ‌యం… ఆ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించడం వంటి స‌న్నివేశాల‌తో సాగిపోతాయి. ఒక‌రి వ్య‌క్తిత్వాల గురించి మ‌రొక‌రికి తెలిసిపోతాయి. విరామానికి ముందే క‌థ‌లో అస‌లు మ‌లుపు మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత నుంచే క‌థ మ‌రింత ర‌క్తి క‌డుతుంది. ఒక ప‌క్క వ‌రుణ్ -లీలాల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌లో వ‌చ్చిన మ‌లుపు… మ‌రోప‌క్క జైల్లో నుంచి బ‌య‌టికొచ్చిన వ‌రుణ్ కోసం శత్రు సైన్యం అన్వేష‌ణ సాగించ‌డంవంటి స‌న్నివేశాల‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా మారుతుంది.  ప‌తాక స‌న్నివేశాలు మాత్రం మ‌ళ్లీ మ‌ణి ర‌త్నం మార్క్ క‌న్వ‌ర్జేష‌న్‌తో ముగుస్తుంది. ఆ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌వు.

నటీనటుల పనితీరు:

కార్తీ: కార్తి కి ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఒకటనడంలో సందేహం లేదు. తన ప్రేయసికి తన ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశాల్లో కార్తి నటన మెప్పిస్తుంది, కార్తిలో ఇంత ఇంటెన్స్ యాక్షన్ ఎప్పుడూ చూసి ఉండరు.

అదితి: అదితిరావు తన టిపికల్ అందంతో.. హావభావాలతో ఆకట్టుకుంది. ఆమె కళ్లతో పలికించిన భావాలు వావ్ అనిపిస్తాయి.

మిగిలిన నటులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ :

  • కథ
  • కార్తీ, అదితి
  • కెమెరా వర్క్
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

  • సెకండ్ ఆఫ్ లో కొన్ని సన్నివేశాలు
(Visited 1,113 times, 1 visits today)