Home / Inspiring Stories / జల దిగ్భంధంలో చెన్నై

జల దిగ్భంధంలో చెన్నై

Author:

chennai
కని విని ఎరుగని వర్షం, ఎటు చూసిన నీరు, పని చేయని కరెంట్, వరదలకు అస్తవ్యస్తమైన రవాణా వ్యవస్థ అన్ని కలిపి చెన్నై వాసులకి నరకం రుచి చూపిస్తున్నాయి. ఈ వర్షం ఇంకా ఇలాగే ఐదు రోజులపాటు కొనసాగనుంది అన్న చేదు వార్త చెన్నై వాసులని కలవరపాటుకి గురిచేస్తుంది. నిత్యావసర సరకులు అందక చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇంకొంతమంది త్రాగు నీరు కూడా దొరకక వర్షాలు తగ్గాలని ఆ దేవుడిని ప్రార్దిస్తున్నారు.

chennaiAirport
ఏనాడు లేని విధంగా, ఒకేసారి విమానాశ్రయం, రేల్‌వే స్టేషన్లు, బస్ స్టాండ్ లు మూసివేశారంటే పరిస్థితీని అర్దం చేసుకోవచ్చు. సహాయం కోసం భారతీయ మిలిటరీ, నేవీ బృందాలు రంగంలోకి దిగి ముంపుకి గురి అయిన ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. పనిలో పనిగా కార్పొరేట్ కంపనీలూ తమకి తోచిన సహాయం చేస్తున్నారు. ఎయిర్‌టెల్ సంస్థ వరదల్లో చిక్కుకున్న తమ కస్టమర్స్ కోసం ఉచిత 30 రూపాయల బ్యాలెన్స్ ఇస్తుంది. ఓలా క్యాబ్స్, పేటిఎం మరియు ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు భాదీతులకు సహాయం చేయడం కోసం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వర్షాలు తగ్గి చెన్నై మామూలు స్థితికి రావాలని కోరుకుందాం.

(Visited 28 times, 1 visits today)