Home / Latest Alajadi / త్వరలో చెక్ బుక్ లు రద్దు..!

త్వరలో చెక్ బుక్ లు రద్దు..!

Author:

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ, నల్ల ధనాన్ని అరికట్టేందుకు గత సంవత్సరం నవంబర్ లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి అలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లుగా చర్చ జరుగుతుంది, నోట్ల రద్దు తరువాత భారీగా పెరిగిన డిజిటల్ లావాదేవీలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడం..వల్ల , క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం, ఆన్ లైన్, డిజిటల్ లావాదేవీలను పెంచాలనే ఉద్దేశంతో చెక్ బుక్ లను రద్దు చేయాలనే విషయంలో చర్చ నడుస్తుందని అఖిలభారత ట్రేడర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ అంటున్నారు.

త్వరలో చెక్ బుక్కులు రద్దు ..!

చెక్‌బుక్‌లను ఉపసంహరిస్తే ఏం జరుగుతుంది? 

  • గతంలో పెద్దనోట్లను రద్దుచేసినపుడు తలెత్తిన ఇబ్బందుల్లాంటివే చెక్‌బుక్‌లను ఉపసంహరించినా రావొచ్చని వాణిజ్య వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే..
  • వ్యాపార లావాదేవీలు ఎక్కువగా చెక్కుల ద్వారానే జరుగుతున్నాయి.
  • నగదు లేదా చెక్కుల ద్వారా దాదాపు 95 శాతం వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని నిపుణుల అంచనా. పెద్దనోట్ల రద్దు తర్వాత.. నగదు లావాదేవీలు కొంతవరకు తగ్గి చెక్‌ల ద్వారా చెల్లింపులు పెరిగాయంటున్నారు.

చెక్‌ల వినియోగం ఇలా…

  • చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు చెక్‌ల ద్వారా వ్యాపారాన్ని ఎక్కువగా చేస్తుంటాయి.
  • వినియోగదారుడి వద్ద నుంచి పోస్ట్‌డేటెడ్‌ చెక్‌ను తీసుకుని అతనికి సరకుల్ని అందజేస్తాయి. సంబంధిత తేదీలోగా అతన్నుంచి డబ్బు వసూలుచేసుకుంటాయి.
  • ఇతరులకు చెల్లింపులు, భూములు, ఇళ్ల కొనుగోలుకూ చెక్‌లను వాడుతున్నారు.
  •  ఇంటి అద్దెల్నీ చెక్‌ల రూపంలో చెల్లిస్తున్నారు.
  •  భారీ మొత్తాల చెల్లింపులకు చెక్‌ ఉత్తమ మార్గమని చిల్లర, టోకు వర్తకులంటున్నారు.

డిజిటల్‌ లావాదేవీలు ఇలా..

  • గత ఏడాది నవంబరులో పెద్దనోట్లను రద్దుచేసిన తర్వాత ఈ ఏడాది సెప్టెంబరు వరకు డిజిటల్‌ లావాదేవీలు 31% పెరిగినట్లు ఆర్‌బీఐ చెబుతోంది.
  • పెద్దనోట్ల రద్దుకు ముందు ఉదాహరణకు 100 డిజిటిల్‌ లావాదేవీలు జరిగితే.. అవి నోట్ల రద్దు తర్వాత 300 లావాదేవీలకు పెరిగాయి. ప్రస్తుతం ఇవి 180-190 మధ్య ఉన్నాయి.
  • గత ఏడాది డిసెంబరులో 100 కోట్ల డిజిటల్‌ చెల్లింపులు జరిగితే ఈ ఏడాది సెప్టెంబరు నాటికి అవి 87.7 కోట్లకు పడిపోయాయి.
  • ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి 2500 కోట్ల డిజిటల్‌ చెల్లింపులు జరగాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. చెక్‌బుక్‌లను రద్దుచేయడం ద్వారా ఈ లక్ష్యానికి దగ్గర కావాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.

ఎక్కువ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కంపెనీలలో, ఇన్సూరెన్స్ కంపెనీలు, నష్టపరిహారం చెల్లించే ప్రభుత్వ సంస్థలు, వివిధ పనులకు కాంట్రాక్టర్లకి చెల్లింపుల విషయంలో 60 శాతం వరకు చెక్ బుక్ ల ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు, చెక్ బుక్ లను రద్దు చేయడం వల్ల వీటిపై చాలా ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..చూద్దాం..!

(Visited 515 times, 1 visits today)