Home / General / భారత్, చైనా సరిహద్దులో ఏం జరుగుతుంది..? చైనా అసలు ప్లాన్ ఏంటో తెలుసా..?

భారత్, చైనా సరిహద్దులో ఏం జరుగుతుంది..? చైనా అసలు ప్లాన్ ఏంటో తెలుసా..?

Author:

గత కొన్ని రోజుల నుండి మనం భారత దేశం, చైనా మధ్యలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల గురుంచి వింటూనే ఉన్నాం, అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది అంటే.. భూటాన్ భూభాగంలో చైనా చేస్తున్న ఒక నిర్మాణాన్ని మన భారత దేశం వ్యతిరేకించి ఆ నిర్మాణాన్ని ఆపేయడం వల్ల ఈ ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయి, సిక్కిం, భూటాన్, చైనా సరిహద్దుల్లో చైనా ఒక రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది, ఆ రోడ్ నిర్మాణం పూర్తి అయితే మన దేశానికి సైనిక పరంగా అత్యంత కీలకమైన ప్రదేశం సిలిగురి కారిడార్ పై చైనా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది అని మన అధికారులు భూటాన్ సహాయంతో ఆ రోడ్ నిర్మాణాన్ని ఆగేలా చేసారు, ఈశాన్య రాష్ట్రాలని (నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ) మన దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిపే ప్రాంతమే ఈ సిలిగురి కారిడార్, ఈ సిలిగురి కారిడార్ ని వశం చేసుకుంటే వ్యూహాత్మకంగా మన దేశంపై పైచేయి సాధించవచ్చని చైనా ఎత్తుగడ, ఈ ప్లాన్ ని ముందే మన అధికారులు పసిగట్టి ఆ రోడ్ నిర్మాణాన్ని ఆగేలా చేసారు.

సిలిగురి కారిడార్

ఏదో విధంగా ఇండియా- భూటాన్ రక్షణ ఒప్పందాల నుండి భూటాన్ ని బయటపడేలా చేసి, ఆ తరువాత భూటాన్ కి అత్యంత కీలకమైన ఢోక్లామ్ ప్రాంతాన్ని ఆక్రమించుకొని, అదే సమయంలో ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలకి మిగతా ప్రాంతాలకి లింక్ గా ఉన్న సిలిగురి కారిడార్ పై ఆధిపత్యం సాధించాలి అని చైనా పావులు కదిపింది.

ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో కొంత భూమిని ఆక్రమించుకున్న చైనా అక్కడ మనదేశానికి అత్యంత కీలకమైన ప్రాంతం తవాంగ్ ని కూడా ఆక్రమించుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంది, గతంలో చైనా మనదేశానికి ఒక ఆఫర్ కూడా ఇచ్చింది ,మనోళ్లు అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ని వదిలేస్తే చైనా కాశ్మీర్ లో ఆక్రమించుకున్న అక్సాయ్ చిన్ వదిలేస్తాం అని కానీ ఈ ఆఫర్ ని మనోళ్లు తిరస్కరించారు, బెదిరింపులు, ఆక్రమణలతో ఇప్పటికే టిబెట్ ని వశపరుచుకున్న చైనా, భూటాన్ ని కూడా వశపరుచుకొని ఇండియా పై చేయి సాధించాలని ఎత్తుగడలు వేస్తుంది, చైనా ఎత్తుగడలని గ్రహించిన భూటాన్ చైనాకి ఇప్పుడు సహకరిస్తే భవిష్యత్ లో తమ దేశ ప్రాంతాలని కూడా చైనా ఆక్రమించే ఆవకాశం ఉంది అని తెలుసుకొని చైనాకి చెక్ పెట్టె విధంగా భారత్ కి సహకరిస్తూ చైనా ఆశలపై భూటాన్ నీళ్లు చల్లింది.

సిలిగురి కారిడార్

మొత్తానికి చైనా వ్యూహం ఏంటి అంటే భూటాన్ సహాయంతో సిలిగురి కారిడార్ పై చేయి సాధించి ఆ తరువాత భూటాన్ కి కీలకమైన ఢోక్లామ్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుంటే రెండు దేశాలపై వ్యూహాత్మకంగా పై చేయి సాధించొచ్చు అనేది చైనా ఎత్తుగడ. అటు అగ్రరాజ్యం అమెరికాతోను, ఇటు సోవియట్ రాజ్యం రష్యాతోను ఇండియా మితృత్వం పెంపొందించుకోవడం చైనాకి మింగుడుపడటం లేదు, అందుకే భారత దేశాన్ని వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని ఇలాంటి ఆక్రమణలకు దిగుతుంది.

(Visited 2,364 times, 1 visits today)