Home / Latest Alajadi / తన జీవితంలో ఎలాగైనా విమానం కొనుక్కోవాలనే తపన ఉన్న ఓ వెల్లుల్లి రైతు ఏం చేశాడో తెలుసా..?

తన జీవితంలో ఎలాగైనా విమానం కొనుక్కోవాలనే తపన ఉన్న ఓ వెల్లుల్లి రైతు ఏం చేశాడో తెలుసా..?

Author:

తన జీవితంలో ఎలాగైనా విమానం కొనుక్కోవాలనే తపన ఉన్న ఓ వెల్లుల్లి రైతు ఏం చేశాడో తెలుసా..? విమానం కొనుక్కొనే స్థోమత లేక దాని ఆకృతిలో కనిపించేలా ఓ నిర్మాణాన్ని రూపొందించుకుంటున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! చైనాకు చెందిన ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఆ దేశానికి చెందిన జు యే అనే వెల్లుల్లి రైతు విమాన ప్రతిరూపాన్ని నిర్మించుకుంటున్నాడు. తన జీవితంలో ఎప్పటికైనా విమానం కొనాలనేది అతని కల.

chinese-garlic-farmer-builds-a-plane

అందులో భాగంగానే ఎయిర్‌బస్‌ ఏ320 విమానాన్ని పోలి ఉండే నమూనా తయారు చేయించుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి సాగుతున్న దీని నిర్మాణం దాదాపు తుదిదశకు చేరింది. ఇందుకోసం రైతు ఇప్పటి వరకూ 2.6 మిలియన్‌ యువాన్లు (రూ.2 కోట్లు)వెచ్చించాడు.124 అడుగుల పొడవు, 118 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ విమానం గాలిలోకి ఎగరలేకపోయినా.. తన కల నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందని జు యే అన్నాడు. నిర్మాణం పూర్తయ్యాక దీనిలో ఓ రెస్టారెంటును పెడతానని చెబుతున్నాడు.

(Visited 1 times, 1 visits today)