Home / Entertainment / చిరు సీక్రేట్ మీటింగ్ లు ఎవరి కోసం?

చిరు సీక్రేట్ మీటింగ్ లు ఎవరి కోసం?

Author:

మెగా హీరోలు బాలీవుడ్ పై కన్నేసారా..!? తెలుగుతో పాటూ హిందీ పరిశ్రమలోనూ వెలిగిపోవాలని కలలు కంటున్నారా..? ఔననే అంటున్నాయి సినీ వర్గాలు.. తాజాగా అల్లు అర్జున్ ముంబైలో ఇల్లు తీసుకోవటం, అలాగే బాలీవుడ్ లో రామ్ చరణ్ పాగా కోసం చేస్తున్న ప్రయత్నాలు…ఒక్కొక్కటి నీ కలిపి చూస్తూంటే చూస్తుంటే మెగా హీరోల సినిమా బాలీవుడ్ తెరపై కనిపిస్తోంది. మెగా బ్యాచ్ బిటౌన్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది.ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని కలిసారట. చరణ్ బి-టౌన్ భవిష్యత్ ప్రణాళికల పైనే కొన్ని విషయాలను షారుఖ్ ఖాన్ తో చిరు మాట్లాడినట్టు తెలుస్తుందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు  వినిపిస్తున్నాయ్. అయితే వీరిద్దరూ కలిసినట్టుగా మీడియాకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంతా సీక్రెట్ గానే జరిగిందట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం “దిల్ వాలే” కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమం, గత పన్నెండు రోజులుగా హైదరాబాద్ లోనే జరుగుతుంది.

షారుఖ్ ఖాన్ సరసన కాజోల్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా సంవత్సరాల తరువాత షారుఖ్ ఖాన్, కాజోల్ కాంబినేషన్ లో వస్తున్న “దిల్ వాలే” తో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పైకి రానుండటం తో ఈ మూవీకి ఎక్కడలేని హైప్ క్రియేట్ అవుతుంది. మరో రీజన్ ఏమిటంటే బ్లాక్ బస్టర్ దర్శకుడు రోహిత్ శెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించటం.రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీలు బాలీవుడ్ బాక్సాపీస్ ని షేక్ చేశాయి. దీంతో దిల్ వాలే మూవీ సైతం అదే రిజల్ట్ ని అందుకుంటుందని బిటౌన్ ప్రేక్షకుల్లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో కింగ్ ఖాన్ని చిరు సీక్రెట్ గా కలవటం అనేది అందరిలోనూ హాట్ టాక్స్ గా మారింది.

ఈ ఇద్దరు స్టార్లూ కలిసి ఏమ్మాట్లాదుకున్నారు? ఇది మామూలు ఫ్రెండ్లీ మీటేనా లేక తనయుది బాలీవుద్ భవిశ్యత్ పై చిరు కింగ్ ఖాన్ తో మాట్లాడి ఉంటారా..!? అనేది అందరి మనసుల్లోనూ మెదులుతున్న ఆలోచన.

(Visited 69 times, 1 visits today)