మెగా ఫ్యామిలీ కీ లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు కి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు బహిరంగ రహస్యమే. ఎప్పుడు అవకాశం దొరికినా చిరంజీవి పై ఒకటో రెండో మాటలు వెయ్య కుండా వదలరు దాసరి నారాయణ రావు . చాలాసార్లు దాసరి మెగాస్టార్ నీ ఆయన పద్దతులనీ బాహాటంగానే విమర్శించారు. ప్రజా రాజ్యం పార్టీ స్థాపించిన కొత్తల్లో దాసరి నారాయణ రావు తీసిన మేస్త్రీ సినిమా లో చిరంజీవినే ఉద్దేశించినట్టుగా ఉండే సంభాషణలున్నాయనీ, అసలు సినిమానే చిరు పై ఒక సెటైర్ గా తీసారనీ చాలా మంది అభిప్రాయం కూడా. ఐతే ఇప్పుడు మెగాస్టార్ 60 పుట్టిన రోజు వేడుకల సందర్బంగా మళ్ళీ ఆ వివాదం తెర పైకి వచ్చినట్టే కనిపిస్తోంది. దాసరి చిరు పై కొద్దిగా చిరాకు పడ్డారట. వ్యక్తి గత విషయాలు ఎలా ఉన్నా ఇది కూడా ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ వేడుక లాంటిదే కదా. ఆమాత్రం తెలియదా వాళ్ళకి అంటూ ఆయనకి సన్నిహిత మిత్రుల దగ్గర దాసరి నారాయణ రావు చెప్పుకున్నారట.
ఇంతకీ విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి శశ్టి పూర్థి సందర్భంగా. తనయుడు రాం చరణ్ పార్క్ హయాత్ హొటల్ లో ఏర్పాటు చేసిన ఆ పార్టీకి అన్ని “వుడ్” ల నుంచీ ప్రముఖులు వచ్చిన విశయం తెలిసిందే. కోలీవుడ్ నుండి సూర్య, బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ , శ్రీదేవీ బోనీ కపూర్, సూపర్ స్టార్ అమితాబ్ భార్య అయిన జయాబచ్చన్ వారి కుమారుడు అబిషేక్ తో సహా వచ్చారు. ఆ పార్టీకి తెలుగు సినిమా పరిశ్రమ లోని ప్రముఖలను అందరిని స్వయంగా ఆహ్వానించిన రాం చరణ్ దాసరికి మాత్రం ఒక మెసేజ్ పంపి ఊరుకున్నారట. కనీసం మొహమాటానికి అయిన కనీసం కాల్ కూడా చేయక పోవటం తో దాసరి నారాయణ రావు కొద్దిగా అసహనంగ ఉన్నట్టు తెలుస్తోంది. ” మనం పిలిచినా ఆయన రాడు అందుకే ఆయన్ని పిలవ లేదు అని రాం చరణ్ అన్నట్టు ” దాసరికి ఎవరో చెప్పటం తో దాసరి మరింతగా సన్నిహితుల దగ్గర భాద పడ్డట్టు తెలుస్తోంది. ఐతే బయట మాత్రం దాసరి ఎక్కడా ఆ విశయం గురించి మాట్లాడకుండా హుందాగానే ఉన్నారు. కానీ దాసరి ఇంకోసారి చిరంజీవి మీద మాటల దాడికి ఏ సినిమా ఫంక్షన్ వేదిక అవుతుందోనని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే పవర్ స్టార్ ఇప్పుడు చేస్తూన సర్దార్ ఐపోగనే చేయ బోతున్న ప్రాజెక్ట్ దాసరి నారాయణ రావు సమర్పణలోనే కావటం గమణార్హం. కొసమెరుపు ఏంటంటే ఎప్పుడూ ఒకళ్ళమీద ఒకళ్ళు మాటల భాణాలు విసురుకుంటూ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదేమో అన్నట్టుండే మోహన్ బాబు గారు మాత్రం సతీ సమేతంగా చిరు బర్త్ డే ఫంక్షన్ కి రావటం. ఇద్దరు మిత్రులు చిరునవ్వులతో హత్తుకోవటం చూసి కొందరు ఆశ్చర్య పోతే ఇంకొందరు ఎంతైనా ఒకప్పుడు స్నేహితులే కదా. దీన్లో ఏముందీ అనుకున్నారట.