Home / Entertainment / సినీ చరిత్రలో మరో భాషా ఔతుందా ?

సినీ చరిత్రలో మరో భాషా ఔతుందా ?

Author:

ఇరవయ్యేళ్ళ క్రితం వచ్చిన భాషా దక్షిణాదినే కాదు భారతీయ సినిమానే నే ఒక ఊపు ఊపిన సినిమా. రజినీ మానిక్ భాషా గా  మాఫియా డాన్ పాత్రకి ప్రాణం పోసి ఒక యూనిక్ గా నిలిచాడు. అదే ఫార్ములా తో కోలీవుడ్ లోనూ, టాలీ వుడ్ లోనూ ఎన్నో సినిమాలొచ్చాయ్. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా సామాన్యుడి గా కనిపించే హీరో వెనక ఉన్న అసలు కథ ఇంటర్ వెల్ కి ముందు ఓపెన్ అయ్యి సెకెండాఫ్ లో హీరో పూర్తిస్తాయి లో విర్చుకు పడటం విలన్లని మట్టి కరిపించటం ఈ  పాయింట్ ఎన్నొ హిట్ సినిమాలని ఇచ్చిందో అందరికీ తెల్సిందే. ఇప్పటికీ మాఫియా కథల్లో డాన్ పాత్ర చేసే నటులకు రజనీకాంత్ నటన ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అదే స్థాయి సంచలనానికి తెర లేచినట్టే కనిపిస్తోంది. సూపర్ స్టార్ మళ్ళీ ఇంకో సారి మాఫియ డాన్ గా కనిపించ బోతున్నాడు. చెన్నై మాఫియా నేపధ్య కథ లో మరో సారి తన స్టామినా ఏంటో చూపించేందుకు సిద్దమయ్యాడు. తన కొత్త ప్రాజెక్టు కబలి లో ఇంకోసారి డాన్ గా తన అభిమానులకు కనిపించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ సెప్టెంబర్ 17 న రానుంది.

ఈ నేపథ్యం లో  కబలి పై అంచనాలు మొదలయ్యాయి. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అసలు కబలి గా రజినీ కాంత్ కొత్త గెటప్ ఎలా ఉండబోతోంది ? రజినీ పక్కన రాధిక ఆప్టే ఎలా ఉండ బోతోంది?  ప్రతి సినిమాలోనూ తన ప్రత్యేక స్టైల్ లో ఒక మానరిజాన్ని చూపించే రజనీ ఈసారి ఏం చూపించబోతున్నాడు?. ఇలా ఎన్నో ప్రశ్నలతో రజిని కాంత్ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఉన్నారు ఇప్పటికే ఒక చిత్రం సోషల్ మీడియ లో కనిపిస్తోంది. ఈ చిత్రం లో రజినీ తెల్లని గడ్డం తో పక్కా డాన్ లూక్ తో కనిపిస్తున్నాడు. నిజమైన కబలి ని చూడాలంటే ఈ సెప్టెంబర్
పదిహేడు వరకూ ఎదురు చూడాల్సిందే.

(Visited 21 times, 1 visits today)