Home / Inspiring Stories / సినిమా వాళ్ళని బాగా వాడుకుంటున్న కేటీఆర్.

సినిమా వాళ్ళని బాగా వాడుకుంటున్న కేటీఆర్.

Author:

తెలంగాణా రాష్ట్రం లోని యువ నాయకుల్లో కేటీ ఆర్ ప్రత్యేకంగా కనిపిస్తారు. ముఖ్యమంత్రి కుమారుడు అనే ముద్రనుంచి బయట పడి తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోవటానికి ఒకప్పటి ఈ యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. సమైక్యరాష్ట్రం లో ఉద్యమ పార్టీ నేతగా ఉన్నప్పుడు కొన్ని వ్యాఖ్యల వల్ల విమర్శలకు గురైనా.తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన మితభాషి అనే అనిపించుకున్నాడు. అమెరికాలో ఒక సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా తన కెరీర్ ని సాగించే టప్పుడే తండ్రి ప్రారంబించిన “తెలంగాణా రాష్ట్ర సమితి” పార్టీ లో చేరి. పార్టీలో చురుకైన కార్య కర్త గా పేరు తెచ్చుకున్న కేటీఆర్. తన సాఫ్ట్ వేర్ రంగం లోని అనుభవాన్నంతా రాష్ట్రాభివృద్ది కోసం ఉపయోగించే పనిలో పడ్డారు. తెలంగాణా రాష్ట్రం లోకి ఐటీ కంపెనీల పెట్టుబడు లను ఆహ్వానించేందుకు. ప్రత్యేక ప్రణాలికలూ తయారు చేస్తున్నారు. ఐతే “తన లక్ష్యం కేవలం హైదరాబాద్ అభివృద్ది మాత్రమే కాదనీ,       పూర్తి తెలంగాణా పల్లెలలతో సహ ఎదగాలన్నదే తన ఆశయం” అనీ ఎన్నోసార్లు చెప్పారు.

తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు మారుమూల గ్రామాల అభివృద్దికోసం తెచ్చిన “గ్రామ జ్యోతి” పథకాన్ని కేటీఆర్ బాగానే వాడుకుంటున్నారు. తనదైన పద్దతిలో ఈ పథకాన్ని ముందుకు తీసుకు వెళ్ళే పనిలో భాగంగా సినీ ప్రముఖులతో తరచూ భేటీ అవుతున్నారు. ఇప్పటికే “గ్రామ జ్యోతి” పథకం లో పాలు పంచుకోవటానికి ముందుకు వస్తున్నారు.. ఈ మద్యనే కొరటాల శివ దర్సకత్వం లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ని కూడా “గ్రామ జ్యోతి” పథకం పై అవగాహనకు బాగానే దోహదం చేఅసింది. కేటీఆర్ కూడా  ఇదే పద్దతిని అందుకొని ఇకాస్త ముందుకు వెళుతున్నారు ఇప్పటికే కొంత మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఊరును దత్తత తీసుకుంటామని ముందుకు వస్తున్నారు. స్వయంగా మహేష్ బాబు కూడా మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక ఊరిని దత్తత తీసుకున్నారు. ఐతే ఇప్పుడు తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా శ్రీమంతుడు బాటలో కేటీఆర్ తో కలిసి నడిచేందుకు సిద్దమయ్యారు. ప్రకాశ్ రాజ్ కూడా మహేష్ బాటలోనే తాను దత్తత తీసుకునే గ్రామాన్ని మహబూబ్ నగర్ నుంచే ఎంచుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డి పల్లిని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకాష్ రాజ్ వెల్లడించారు.  “ప్రకాశ్ రాజ్  పౌండేషన్” ద్వారా గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని తనకు సహకారం అందించమనీ చెప్పటానికి సచివాలయంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుని కలిసి మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండా రెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న ఆకాంక్షని  మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు.. తాను ఇప్పటికే కర్ణాటక లో తన “ప్రకాశ్ రాజ్ పౌండేషన్” ద్వారా చేస్తున్న పలు కార్యక్రమాలను మంత్రికి వివరించారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలోని కొండా రెడ్డి పల్లెలో తాను వ్యవసాయం  చేస్తున్నట్లు. ఇందులో పలు శాస్ర్తీయ పద్దతులను అనుసరిస్తున్నట్లు తెలిపారు. అక్కడి పరిస్తితులు తనని కదిలించాయనీ. తనకు మంచి చేసిన ఊరికి తానూ ఏదైనా చేయాలనుకుంటున్నట్టూ అందుకే తాను నివసిస్తున్న ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడి రైతులకి సహయం అందించేందుకూ గ్రామంలో మౌళిక వసతుల కల్పనకి ప్రభుత్వంతో పనిచేసేందుకు ముందుకు వచ్చినట్టు కేటీ ఆర్ కి తెలిపారు

(Visited 66 times, 1 visits today)