Home / Latest Alajadi / ఫోటో తీయండి..డబ్బులు పొందండి: ఇక నుండి మీరే ట్రాఫిక్ పోలీస్..!

ఫోటో తీయండి..డబ్బులు పొందండి: ఇక నుండి మీరే ట్రాఫిక్ పోలీస్..!

Author:

హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలని, రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడానికి జరిమానాలు పెంచడంతో పాటు అనేక చర్యలు చేపట్టిన పోలీసులు మరొక విన్నూత కార్యక్రమాన్ని రూపొందించారు, ఇప్పటి వరకు రోడ్ పై వెళ్లే వాహనాలలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళకి పోలీసులు మాత్రమే ఫోటోలు తీసి చలాన్ లు రాసేవారు, ఇక నుండి ఆ ఫోటోలు తీసే అవకాశాన్ని ప్రజలకి కూడా కల్పించబోతున్నారు, ఎవరైనా సరే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తుంటే ఫొటో తీసి పంపిస్తే చాలు వెంటనే వాళ్లకు చలానా వస్తోంది. అంతేనా మీ ఫోన్ నెంబర్ కు కూడా పాయింట్లు యాడ్ అవుతాయి. పాయింట్లు పెరిగే కొద్దీ.. మీ ఖాతా డబ్బులు కూడా పడతాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకొస్తున్న ఈ సిటిజన్ పోలీసింగ్ స్కీమ్ వాహనదారుల్లో కలకలం రేపుతోంది.

క్లిక్ కొట్టు.. డబ్బులు పట్టు : మీరే ట్రాఫిక్ పోలీస్

ఇది ఎలా ఉండబోతుంది అంటే..రోడ్ పైన ఎవరైనా వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలని అతిక్రమించి ప్రయాణిస్తుంటే వారి ఫోటోలు, వీడియోలు ఎవరైనా తీసి ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ కి పంపిస్తే, ఆ సమాచారం పక్కగా ఉంటే ఆ ఫోటో, వీడియో ఆధారంగా పోలీసులు చలాన్ లు విధిస్తారు, మీరు చేసిన ఈ సామజిక సేవకు గాను మీ ఫోన్ నెంబర్ కు పాయింట్లు యాడ్ చేస్తారు. అలా 100 పాయింట్లు అవ్వగానే 100 రూపాయలు మీరు చెప్పిన అకౌంట్ వేస్తారు. సో.. ఇక ట్రాఫిక్ పోలీస్ మాత్రమే ఫొటో తీస్తాడని భయపడే వారు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ పథకం ఇప్పటికే గోవాలో విజయవంతంగా నడుస్తుంది, ఇది అమలుచేసినప్పటి నుండి గోవాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాళ్లలో భారీగా తగ్గుదల కనిపించడంతో మన హైదరాబాద్ పోలీసులు కూడా త్వరలో సిటిజన్ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నారు.

సిటిజన్ పోలీసింగ్ లో ఫోటోలు, వీడియోలు పంపే వారికి ఈ విధంగా పాయింట్స్ లభిస్తాయి:

  • రాంగ్ రూట్ వెహికల్ నడిపిన ఫొటో, వీడియోకి 10 పాయింట్లు.
  • ఫుట్ ఫాత్, జీబ్రా క్రాసింగ్ లపై వెహికల్స్ నిలపడం పై 3 పాయింట్లు.
  • ట్రిపుల్ రైడింగ్ కు 10 పాయింట్లు.
  • నంబర్ ప్లేట్ సరిగా లేకపోతే 3 పాయింట్లు.
  • సీట్ బెల్ట్ లేకుండా ఉంటే 7 పాయింట్లు.
  • హెల్మెట్ లేకపోతే 7 పాయింట్లు.
  • బ్లాక్ గ్లాస్ ఉంటే 3 పాయింట్లు.
  • సిగ్నల్ జంపింగ్ 10 పాయింట్లు.
  • ర్యాష్ డ్రైవింగ్ 10 పాయింట్లు.
  • ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ పై 10 పాయింట్లు.

ఇక నుండి మీకు హెల్మెట్ లేకున్నా, సిగ్నల్ జంప్ చేసిన, రాష్ డ్రైవింగ్ చేసిన, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన, రాంగ్ పార్కింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసిన కేవలం పోలీసులే కాదు మీ వాహనం చుట్టూ ఉండే వాళ్ళలో ఎవరైనా సరే సిటిజన్ పోలీసింగ్ లో భాగంగా మీకు చలాన్ విధించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండి రూల్స్ పాటించండి. అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న ఎవరైనా సరే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వాళ్ళ ఫోటోలు, వీడియోలు పంపి డబ్బులు సంపాదించండి.

Must Read: బైక్ రైడర్స్ కి ట్రిపుల్ షాక్..! అందరు ఫైన్ కట్టాల్సిందే..!

(Visited 1,345 times, 1 visits today)