Home / Latest Alajadi / సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో ప్రమాదం తప్పింది.

సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో ప్రమాదం తప్పింది.

Author:

కరీంనగర్ లో సీఎం బయలుదేరే సమయానికి హెలికాప్టర్ లోపలున్న ఓ బ్యాగు నుంచి హఠాత్తుగా పొగలు వచ్చాయి. అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ బ్యాగును దూరంగా తీసుకెళ్లి పడేశారు. హెలికాప్టర్ లో సెక్యూరిటీ సిబ్బంది వాడే కమ్యూనికేషన్ సెట్ లో షార్ట్ సర్క్కూట్ కారణంగా పొగలు వచ్చినట్లు చెబుతున్నారు.

సీఎం కాన్వాయ్‌లోని వైర్‌లెస్ సెట్ నుంచే ఈ మంటలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది బ్యాటరీ ఓవర్ హీట్ కావడంతో అకస్మాత్తుగా పొగలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్ గాల్లోకి లేవకముందే బ్యాగ్‌ను బయటపడేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది..

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)