Home / Inspiring Stories / ప్రముఖ హాస్యనటుడు కొండవలస కన్నుమూత.

ప్రముఖ హాస్యనటుడు కొండవలస కన్నుమూత.

Author:

Kondavalasa is died

ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు (69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘ఒప్పుకోను.. అయితే ఓకే’ అనే డైలాగ్‌తో పాపులర్‌ అయిన కొండవలస.. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షక్షుల హృదయాలను తన నటన శైలితో ఆకట్టుకున్నారు. నాటక రంగంలో మొత్తం 378 అవార్డులతో పాటు రెండు నంది అవార్డులు కూడా లభించాయి.

వంశీ దర్శకత్వంలో ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ అనే చిత్రంతో సినిమారంగంలోకి వచ్చారు. సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్టు ట్రస్టులో కొండవలస ఉద్యోగిగా పనిచేశారు. ఆగస్టు 10, 1946వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా, కొండవలస గ్రామంలో లక్ష్మణరావు జన్మించారు.

(Visited 74 times, 1 visits today)