Home / health / కిడ్నీలో రాళ్ల సమస్యని కొత్తిమీర చిట్కాతో సహజంగా తగ్గించుకోండి..!

కిడ్నీలో రాళ్ల సమస్యని కొత్తిమీర చిట్కాతో సహజంగా తగ్గించుకోండి..!

Author:

ఈ మధ్య కాలంలో ఎక్కువమందిని ముఖ్యంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో కిడ్నీలో రాళ్లు ప్రధానమైనది, ఇంతకుముందు ఈ సమస్య 40 ఏళ్ళు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించేది, ప్రస్తుతం 25 ఏళ్ళ యువకులు కూడా కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల వెంట తిరుగుతున్నారు, సరియైన తిండి, నిద్రలేమితో ముఖ్యంగా సరిపడినన్ని నీళ్లు తాగగాపోవడం, మసాలాలు ఎక్కువగా ఉండే తిండి తినడం వల్ల యువతలో కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయని వైద్యులు తెలిపారు, కిడ్నీలో రాళ్ల సమస్యని తగ్గించుకోవడానికి, టాబ్లెట్లు, ఆపరేషన్ల కంటే సహజ పద్ధతులే ఆరోగ్యానికి మంచివని వైద్యులే సూచిస్తున్నారు, మన దగ్గర కిడ్నీలో రాళ్ల సమస్యకి సహజ పద్దతిలో చాలా పద్ధతులు ఉన్నాయి, అందులో ఎక్కువమంది ఉపయోగించే చిట్కా కొత్తిమీర రసం చిట్కా.

కొత్తిమీరతో కిడ్నీలో రాళ్లు కరిగించవచ్చు.

సాధారణంగా మనం కొత్తిమీరని కూరలలో మంచి రుచి కోసం వాడుతాం, ఆ కొత్తిమీర ఆకులలో చాల ఆరోగ్య పోషకాలు ఉన్నాయి, ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీర ఆకులను కత్తిరించాలి. కత్తిరించి ముక్కలను శుభ్రంగా కడిగి కొంత నీటిలో వేసి 10 నిమిషాలపాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని ఫిల్టర్ చేసి సీసాలో భద్రపరుచుకోవాలి ప్రతి రోజు ఒక గ్లాసు ఆ రసాన్ని తాగడం వల్ల ఆ రసంలోని పోషకాలు కిడ్నీలలో రాళ్లుగా పేరుకపోయే లవణాలని కరిగిస్తాయి, ఈ చిట్కాని మన తాతల ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగించేవారు, వైద్యం పేరుతో కొన్ని వేల రూపాయలని ఖర్చు చేసే బదులు మార్కెట్ లో 10 రూపాయల కొత్తిమీరతో సహజ పద్దతిలో కిడ్నీలని శుభ్రపరుచుకోవడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

(Visited 807 times, 1 visits today)