Home / Latest Alajadi / ఈషా అంబానీ పెళ్లికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..? ఈ లెక్క చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఈషా అంబానీ పెళ్లికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..? ఈ లెక్క చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Author:

మనలాంటి మధ్యతరగతి వాళ్ళమే అతిధుల దగ్గరి నుండి మాట రాకూడదు అని పెళ్ళిలో ఎలాంటి లోటు ఉండకూడదు అనుకుంటాము. అలాంటిది డబ్బునోళ్ల పెళ్లి అంటే మామూలు మాటలా. ఇక మన దేశంలో డబ్బునోళ్లు అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది అంబానీ ఫామిలీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

source

ఇషా అంబానీ, ఆనంద్ పిరమాల్ వివాహం ఈ రోజు జరగనుంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, అంతర్జాతీయ అతిథులు తరలివచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ కూడా విచ్చేశారు. ఈషా అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల ఎఫెక్ట్ ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై పడింది. ఎయిర్‌పోర్టులో ఒక్కఃసారిగా విమాన రాకపోకలు పెరిగిపోయాయి. ప్రైవేటు ఫ్లైట్లు, విమానాలతో కిక్కిరిసిపోయింది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు తమ ప్రైవేట్ ఫ్లైట్స్‌లో తరలివచ్చారు. ఈ క్రమంలో ముంబైలోని విమానాశ్రయం సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఎయిర్‌పోర్టులో ఒకే రోజు 1007 విమాన రాకపోకలు నడిచాయి.

source

పెళ్లి ఖర్చు మరియు వచ్చిన వారి సెక్యూరిటీ వసతి ఇలా అన్ని విషయాకు కలిపి అంబానీ ఫ్యామిలీ ఏకంగా 5 వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగోతంది. లక్షల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి 5 వేల కోట్లను ఖర్చు చేసి కూతురు పెళ్లి చేయడం పెద్ద విశేషం ఏమీ లేదు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ఈ పెళ్లిని రికార్డులోకి ఎక్కించే ఉద్దేశ్యంతో అంబానీ ఫ్యామిలీ ఈ స్థాయి ఏర్పాట్లు చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం అయిదు వేల కోట్లు కాదు పది వేల కోట్లు కూడా ఖర్చు చేసి ఉంటారు అంటూ ప్రచారం చేస్తున్నారు.

(Visited 1 times, 1 visits today)