Home / health / చెవిలో ఇయర్ బడ్స్ వాడటం చాలా ప్రమాదకరం అని తేల్చిన వైద్యులు..!

చెవిలో ఇయర్ బడ్స్ వాడటం చాలా ప్రమాదకరం అని తేల్చిన వైద్యులు..!

Author:

మనలో చాలామందికి కాటన్ ఇయర్ బడ్స్ తో చెవులని శుభ్రం చేసుకునే అలవాటు ఉంటుంది, అలాంటి అలవాటు ఒకవేళ ఉంటె త్వరగా మానుకోవాలని శాస్త్రవేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు, ఇయర్ బడ్స్ వల్ల చెవులకి మంచి కంటే చెడె ఎక్కువగా జరుగుతుంది అని ఒక పరిశోధనలో నిపుణులు తేల్చారు, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు దాదాపు 20 లక్షల మంది కాటన్ ఇయర్ బడ్స్ వాడటం వల్ల వినికిడి సమస్యలతో పాటు అనేక వ్యాధులకు గురయ్యారు అని తెలిపారు, చెవిలో ఏర్పడిన గులిమిని బయటకి తీసేందుకు కాటన్ ఇయర్ బడ్స్ వాడుతుంటారు, కానీ ఇయర్ బడ్ ఆ గులిమిని చెవిలోని కర్ణభేరి దగ్గరకి తోసేస్తుందని, దీనివల్ల చెవికి చాలా ప్రమాదం అని అమెరికాలోని వైద్య బృందం తెలిపింది. చెవిలో ఉన్న నిర్మాణం ప్రకారం గులిమిని చెవులే శుభ్రపరుస్తాయి. కాటన్ ఇయర్ బడ్స్ వాడటం వల్ల పెద్దోళ్ల కంటే చిన్న పిల్లలకే ఎక్కువ ప్రమాదకరం అని ప్రతి సంవత్సరం ఈ సమస్య వల్ల దాదాపు 15 వేల మంది పిల్లలు హాస్పిటల్ లలో చేరుతున్నారని ఈపరిశోధన తేల్చింది.

ear-wax

మనం స్నానం చేసేటప్పుడు లేదా మొహం నీళ్లతో కడుక్కున్నప్పుడు కొన్ని నీళ్లు చెవిలోకి కూడా వెళ్తాయి, ఆ నీళ్లలో గులిమి వెంటనే కరిగిపోయి బయటకి వచ్చేస్తుంది అని వైద్యులు తెలిపారు, చెవిలో గులిమి సమస్య ఎక్కువగా ఉంటే మనం కొన్ని నూనెలని చెవిలో పోస్తాము కూడా, ఇంకా సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి.

(Visited 2,186 times, 1 visits today)