దావూద్ ని త్వరలోనే పట్టుకుంటాం అంతేకాదు అతన్ని ఫినిష్ చేస్తాం . ఇది ఏ బాలీవుడ్ సినిమాలో పెద్ద స్టార్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ కాదు సాక్షాత్తూ కేంద్ర ప్రసారమాధ్యమాల సహాయ మంత్రీ, ఒలింపిక్ షూటింగ్ సిల్వర్ మెడల్ చాంపియన్ స్టార్ షూటర్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అన్న మాటలు. ఒక పాత్రికేయ సమావేశం లో “అసలు ఈ పదిహేను నెలల్లో దావూద్ ఇబ్రహిం విషయం లో ఎండీ ఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది?” అన్న ప్రశ్నకు సమాధానం గా రాజ్యవర్థన్ పై విధంగా స్పందించారు. “భారత్ తన శత్రువులని ఎప్పటికీ వదిలిపెట్టదు, ముంబై పేళుళ్ల గటనలో ఇప్పటికే చివరికొచ్చేసాం దావూద్ ఇబ్రహిం కదలికలపై కన్నేసాం, త్వరలో అతన్ని పట్టుకోవటమే కాదు అతన్ని ఫినిష్ చేస్తాం, ఇప్పటికే ఒక ఆపరేషన్ మొదలయింది “డీ” గ్యాంగ్ పై జరిగే ఈ ఆపరేషన్ గురించి ఇప్పుడే ఏ వివరాలూ బయట పెట్టదలుచుకోలేదు” అని చాలా ఆవేశంగా బదులుచ్చారు.
ఇంతకు ముందు ఎంతోమంది సీనియర్ అధికారులే దావూద్ కి కోవర్టులుగా పని చేస్తున్నారన్న విమర్షలకు గురయ్యారు.ఇలాంటి అనాలోచీత ప్రకటనల వల్ల ఇంతకు ముందే భారత ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు అని పలువురు విమర్శిస్తున్నారు. ఇంటలిజెన్స్ విభాగం కూడా రాజ్యవర్థన్ వ్యాఖ్యలపై అసంతృప్తి వెలిబుచ్చింది. ఇక ఎంతమంది ఎలా స్పందిస్తారో చూడాలి …