Home / Devotional / ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సిన పద్దతులు.

ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సిన పద్దతులు.

Author:

సప్త సముద్రాలు దాటినా కూడా సంసార సాగరం మాత్రం కన్నీటి చుక్క రాల్చకుండా దాటలేము అనేది సామెత, కొంత వరకు అది నిజం కూడా. మన కోసం, కుటుంబం, పిల్లల కోసం ఎన్ని సమస్యలోచ్చినా పోరాడి జీవితం లో గెలవాల్సిందే. ఈ క్రమంలో మనకు ఎదురయ్యే సామాజిక, ఆర్ధిక, సంసార సమస్యలు దూరం చేసుకోవాలన్నా? , ఆ సమస్యలతో పోరాడాలన్నా మానవ ప్రయత్నంతో పాటూ మనకు ఆ దైవ బలం తప్పక కావాల్సిందే. ఎవరెవరి నమ్మకం బట్టి వారు వాళ్ళు నమ్మిన దేవున్నో, దేవతనో పూజిస్తారు. అయితే చాలా మందికి పూజ ఎలా చేయాలో తెలీదు. కొన్ని అనుమానాలు. ఒక్కొకరు ఒకలా చెబుతుంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు.  ఇంకా ప్రతి పూజలో కూడా దీపారాధనే  అతిముఖ్యమైంది. దీపం ఇంటికే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అంటారు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. అందులోనూ ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మరింత శుభదాయకమంట . అయితే ఆవు నేతితో ఎలా దీపం వెలిగించాలి?

deeparadhana

ముందుగా కుందులను శుభ్రం చేసి, కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత ఆ కుందుల్లో ఆవు నెయ్యిని పోసి దానిలో వత్తులు వేసుకోవాలి. కేవలం అగరవత్తులతోనే దీపాన్ని ముట్టించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు. అంతేకాదు ముట్టించిన దీపంతో ఇంకో దీపం కూడా వెలిగించకూడదు. ఇలా ప్రతి రోజూ  ఉదయం, సాయంత్రం ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు వుండవట. చేతికందాల్సిన డబ్బు కూడా సమయానికి అందుతుందట. ఇలా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజ చేయడం ద్వారా  అప్పుల బాధలు కూడా తీరిపోతాయట. దానం, డబ్బు, ఐశ్వర్యం కి ప్రతీకగా పూజించే లక్ష్మీదేవికి నెయ్యి ఎంతో  ప్రీతిదాయకం..  అందుకే ఆవు నెయ్యితో దీపం పెట్టి లక్ష్మీదేవిని స్తుతించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

(Visited 2,168 times, 1 visits today)