Home / Inspiring Stories / “దేవదేవసుతం దేవం జగద్విఘ్నవినాయకమ్”

“దేవదేవసుతం దేవం జగద్విఘ్నవినాయకమ్”

Author:

“హస్తిరూపం మహాకాయం సూర్యకోటిసమప్రభమ్”

పొద్దున్నే తలంటు పోసుకొని కొత్త బట్టలు కట్టుకొని (సారీ బట్టలంటే ఒక పంచె పైన ఉత్తరీయం అంతే) భూమ్మీదకి బయల్దేరాలనే ఉత్సాహం లో తన గ్యారేజ్ లోకి వచ్చి ఎలక మీదికి ఒక్క జంప్ చేసి కూచున్నాడు. అసలే ముసలిదైన ఎలకకి ఆదెబ్బకి కూసాలు కదిలాయ్,నడుమెక్కడ పుటుక్కున విరిగిందేమో అని డౌటొచ్చింది కూడా..!

బ్బా..! స్వామీ కాస్త నెమ్మది నా నడుము విరిగేలా ఉంది” కొద్దిగా నెమ్మదిగానే
విసుక్కుంది. అప్పుడు గుర్తొచ్చింది వినాయకుడికి తన ఎలక ముసలిదైపోయిందని దాన్ని కాస్త జాగ్రత్తగా వాడుకోవాలనీ.

చ..! డాడీ ని ఎన్ని సార్లడిగినా కొత్త ఎలక కొనిపెట్టటం లేదు“మనసులోనే అనుకొని.
సారీ మూషిక్..! నా బర్త్ డే కదా కొద్దిగా హుషారు గా ఉన్నా అంతే
హ..! మీ హుశారు నా ప్రాణాలమీదకొచ్చేలా ఉంది” మెల్లగా భూమి వైపు అడుగులేస్తూ అంది ఎలక.

వినాయకుడికి కోపమొచ్చినా పుట్టిన రోజు మూడ్ పాడు చేసుకోలేక వినీ విననట్టు
వదిలేసాడు.సైలెంటైన గణేషున్ని చూసి.

స్వామీ..! న పాత డిమాండ్ల సంగతేం చేసారు..! ముఖ్యంగా మీరు బరువు తగ్గాలన్న నా డిమాండ్ పై ఏ చర్యా తీసుకోలేదు మీరు” మెళ్ళగా బాంబు పేల్చింది.  ఉలిక్కి పడ్డాడు వినాయకుడు

ఎ..ఏం..డిమాడ్లు నాకేం గుర్తు లేవే..!? ఐనా నీకిప్పుడేం తక్కువైంది? ఈమధ్య నేను బరువు కూడా తగ్గాను కదా?” జేబులోంచి పొద్దున్న బయల్దేరేటప్పుడు వాళ్ళమ్మ ఇచ్చిన లడ్డూ తొండంతో అందుకుంటూ అన్నాడు.

ఒక్క సారి వినాయకుడి తొండం వైపు చూసి నిట్టూర్చింది ఎలక…

ఐనా ప్రతీ సంవత్సరం భూమ్మీదకి తొమ్మిది రోజుల ట్రిప్పు…జాలీ గా ఎంజాయ్ చేయటం… కుడుములూ..ఉండ్రాళ్ళూ..ఇంకో పదికేజీల అదనపు బరువు..” ఈ సారి కాస్త సౌండు పెంచి మరీ విసుక్కుంది.

మూషికా..! నా జాబ్ ఏంటీ భక్తులని దీవించటం.. కూర్చుని చేసే పని ఏం ఆమాత్రం గుప్పెడు పొట్ట ఉండదూ కాస్త సర్దుకోవాలోయ్…!” సంచీలోంచి ఇంకో కుడుము తీసుకొని పంచదార అద్దుకుని తింటూ చెప్పాడు వినాయకుడు.

స్వామీ…!”ఎలక అరిచిన అరుపుకి ఉలిక్కి పడ్డాడు వినాయకుడు.(ఉలిక్కి పడ్డం తో వెన్ను పూస కదిలినట్టైని ఎలకకి.)
“మీరలా కుడుములూ,ఉండ్రాళ్ళూ తిని ఇంకా బరువు పెరిగితే నావళ్ళ కాదంతే  మొన్నటికి మొన్న మొన్న్ అవైకుంఠం వెళ్ళేటప్పుదు అక్కడ ద్వార పాలకుడు ఓవర్ లోడ్ అంటూ  ఫైనేస్తే నాకు చచ్చే అవమానం అనిపించింది తెలుసా..!”

ఆ రోజు జరిగిన అవమానం గుర్తొచ్చి కాస్త సిగ్గు పడ్డాడు వినాయకుడు. కానీ తానేం
చేస్తాడు తన జీన్సే అంత ఏనుగు లావుగా ఉండక ఇలియానా లా సన్నగ ఉంటుందా…  (ఉలిక్కి పడబోయి ఎక్కడ ఎలక నడుం పట్టేస్తుందేమో అని ఈసారికి నిట్టూర్పు తో సరిపెట్టాడు)

మూషికా నీక్కొన్ని విశయాలు చెప్పాలి కాస్త ఆ మేఘం మీద ఆగు” ఎదురుగా వస్తూన్న ఓ పెద్ద మేఘాన్ని చూపించి చెప్పాడు.  మేఘం పైకి రాగానే ఎలక మీదనుంచి దిగిన వినాయకుడు రెందు చేతులతో ఎలక మొహాన్ని పట్టుకోని ఆర్తి గా చూసాడు.

ఆపండి స్వామీ… మీరు మరీ ఇలా ఓదార్పు యాత్ర చేయకండీ రోజు రోజు కీ ఆ “యువనేత” లా తయారవుతున్నారు” దెప్పిపొడిచింది ఎలక.
స్రే.. ప్రతి సంవత్సరం  భూలోకం లో నేను ఎంజాయ్ చేస్తున్నా అన్నావ్ కదా..! అది
ఎంజాయ్ మెంటు కాదయ్యా..! భక్తులని గెలిపించ టానికి యుగాలుగా నేన ఓడిపోతునే ఉన్నాను తెలుసా..!?
ఈ కొత్త వాదనకి ఎలకకి కళ్ళు తిరిగాయ్.

మీరోడి పోవటమేమిటి స్వామీ..!” సరిగా చెప్పండి….
మెల్లగా అరటి పండు తింటూ చెప్పసాగాడు వినాయకుడు…

ప్రతి ఏటా రసాయనాలతో నా విగ్రహాన్ని చేస్తారు ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయగానే ఆ రసాయనాల ప్రభావం తో నా వొళ్ళు ఎంత జబ్బు పడి పోతోందో నీకు తెలుసా.. అంతే కాదు అసలే నావి పెద్ద చెవులు అన్ని సౌండ్ లనీ వింటాయి.. అలాంటి చెవుల పక్కగా హోరు మంటూ స్టీరియోలు పెట్టటం తో నా కు ఈ మధ్య వినికిడి సమస్యా,ఆ శబ్దాలకి హైపర్ టెన్షన్ వచ్చేలా ఉంది. నువ్వు కుడుములూ ఉండ్రాళ్ళూ తింటున్నా అని కుళ్ళుకుంటావు
చూడు అవన్నీ పై పైకే నయ్యా..! ఆ దరిద్రపు కల్తీ సరుకుల నైవేధ్యం తినలేక చస్తున్నా అనుకో..! ఏమైన అందామా అంటే దేవతల రూలు ప్రకారం భక్తులని అనుగ్రహించాలే తప్ప పూజించిన వాన్ని శపించే హక్కు మనకు లేకపాయే...” నిట్టూర్చి తొండం తో ఇంకో లడ్డూ తీసుకున్నాడు వినాయకుదు.

వినాయకుడి భాదలని విన్న ఎలకకి కళ్లలో నీళ్ళు తిరుగు తున్నాయి ఆయన కష్టాలకి మనసు చలించి పోతోంది…ఇంకా చెప్తున్నాడు వినాయకుడు

ప్రతీ ఏటా పత్రి పేరుతో సగానికి సగం పిచ్చి ఆకులు తెచ్చి నా మీద వేస్తారు వాటితో వచ్చే అలెర్జీలు చెప్పలేం అనుకో..,అంతేనా నిమజ్జనం రోజు డీజే లతో హోరెత్తించటం అటుంచి ఈ ట్రాఫిక్ లో గంటల కొద్దీ కూర్చో బెడతారు… ఒక్కొక్కడూ,విస్కీ అనీ,బంగు అనీ బొన్..అనబోయి నాలిక్కరుచుకొని అడ్డమైన మాదకద్రవ్యాలూ తీసుకొని నా పక్కనే గంతులేస్తారు.. ఆ కంపుకి నాకు మైకం కమ్ముతుంది.. చివరికి వీళ్ళ దరిద్రాలన్నీ కలిసే డ్రైనేజ్ నీళ్ళ గుంటల్లో నన్ను పడేస్తారు…మళ్ళీ భయంకర రోగాలు నాకే… పైగా నా బొమ్మలలోని రసాయనాలవల్ల తాను కలుషితం అవున్నానని నన్ను కంట్రోల్ లో పెట్టమని మా పిన్ని “గంగామాత” మా డాడీ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట… ఇంకా...” అంటూ చెప్పబోతున్న వినాయకుడు

స్వామీ…!” అంటూ ఎలక అరుపుకి మళ్ళీ ఉలిక్కి పడ్డాడు.  అ కళ్ళనిండా నీళ్ళతో ఎలక బోరున ఏడుస్తూ ఇన్ని కష్టాలు పడుతూ కూడా భక్తుల మంచి కోరుకునే మిమ్మల్ని అపార్థం చేసుకున్న పాపిని స్వామీ…పాపిని…”

ఏడుస్తూన్న ఎలకని ఓదార్చిన వినాయకుడు.

ఊరుకో మూషికా..! ఊరుకో… ఐనా కష్టాలు దేవుళ్ళకి కాక మనుషులకొస్తాయా” అంటూ ఓదార్చాడు. భక్తులకోసం అన్ని భాదలు పడుతున్న వినాయకున్ని తనపై ఎక్కించుకొని గతుకుల మేఘాల రోడ్డు మీద భూమి వైపు పరుగు తీసింది ఎలక. ఇంకో లడ్డూ తీసుకొని తొండానికి తుడుచుకొని తింటూ చిరునవ్వు నవ్వాడు  వినాయకుడు…

యజ్ఞాయ యజ్ఞహోత్రే చ యజ్ఞేశాయ నమో నమః

  నమస్తే శుక్లభస్మాఙ్గ శుక్లమాలాధరాయ చ

పైన రాసిందంతా కేవలం నవ్వుకోవటానికే ఎవరి మనోభావాలనీ కించపరిచే ఉద్దేశం లేదని మనవి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో Alajadi.com  టీం

(Visited 157 times, 1 visits today)