Home / Reviews / ధృవ రివ్యూ & రేటింగ్.

ధృవ రివ్యూ & రేటింగ్.

ధృవ రివ్యూ ధృవ రేటింగ్

Alajadi Rating

3.25/5.0

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: రామ్ చరణ్-అరవింద్ స్వామి-రకుల్ ప్రీత్ సింగ్-నవదీప్-పోసాని కృష్ణమురళి-నాజర్-షాయాజి షిండే-మధు తదితరులు

Directed by: సురేందర్ రెడ్డి

Produced by: అల్లు అరవింద్-ఎన్వీ ప్రసాద్

Banner: గీత ఆర్ట్స్

Music Composed by: హిప్ హాప్ తమిజా

తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన తని ఒరువన్ ని తెలుగులో చాలామంది రీమేక్ చేయాలనీ ప్రయత్నించారు కానీ ఆ గోల్డెన్ ఛాన్స్ రామ్ చరణ్ కె దక్కింది, చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ చాలా ఇష్టంతో కష్టపడి చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి, ఈ రోజు విడుదల అయిన ధృవ ఎలా ఉందో ఒక లుక్కేయండి.

కథ:

సివిల్స్ లో టాప్ ర్యాంక్ తెచ్చుకొని ఐపీఎస్ ట్రైనీగా పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకొనే సమయంలోనే తన బ్యాచ్ మేట్స్ తో కలిసి సమాజంలో అక్రమాలు చేసే క్రిమినల్స్ ని పోలీసులకి పట్టింస్తుంటాడు ధృవ(రామ్ చరణ్), ట్రైనింగ్ సమయంలోనే సమాజంలో జరిగే అన్ని నేరాలకి గొప్ప సైంటిస్టుగా చలామణి అవుతున్న సిద్దార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) యే కారణం అని తెలుసుకొని , మైండ్ గేమ్ తో అతనిని టార్గెట్ చేస్తాడు, ఈ పోరాటంలో ఎవరు గెలిచారు..? ఎలా గెలిచారు..? అన్నది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

మన సినిమాల్లో ఎక్కువగా హీరో, హీరోయిన్ కోసం విలన్ తో పోరాడటం , నలుగురు కమెడియన్లని పెట్టుకొని టైమ్ పాస్ చెయ్యడం లాంటి స్టోరీలే ఉంటాయి. కానీ  రొటీన్ ఫార్ములా సినిమాలకి భిన్నంగా ఉండడమే ఈ సినిమాకి ఉన్న ప్రత్యేకత, ధృవ ట్రైలర్ లో ఒక చోట హీరో “నీశత్రువు ఎలాంటివాడో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది” అనే డైలాగ్ చెప్తాడు, ఆ డైలాగ్ మీదనే ధృవ సినిమా మొత్తం నడుస్తుంది.

ఫస్ట్ హాఫ్ లో హీరో తన ఇంటలిజెన్స్ తో సమాజంలో జరిగే అన్ని నేరాలకి మూల కారణం సిద్దార్థ్ అభిమన్యుయే అని తెలుసుకుని అతన్నే తన విలన్ గా సెలెక్ట్ చేసుకొని టార్గెట్ చేస్తాడు. హీరో తన విలన్ ని సెలెక్ట్ చేసుకున్న తరువాతే అసలు సినిమా మొదలవుతుంది. ఇంటర్వెల్ తరువాత నుండి క్లైమాక్స్ వరకు హీరో, విలన్ ల మైండ్ గేమ్ తో సినిమా ఉంటుంది, హీరో, విలన్లు ఇద్దరు ఎత్తుకుపైఎత్తులు వేసుకుంటూ ప్రేక్షకులని సినిమాతో ఎంగేజ్ అయ్యేలా చేస్తారు.

ఈ సినిమాకి హీరో క్యారెక్టర్ కంటే సిద్దార్థ్ అభిమన్యు క్యారెక్టర్ యే పెద్ద బలం, తమిళ్ వెర్షన్ లో ఉన్న కథ, కథానాలలో ఎలాంటి అనవసరపు మార్పులు చేయకుండా సినిమాని తీయడమే ధృవకి ప్లస్ పాయింట్, 8 అనే కాన్సెప్ట్ తో హీరో విలన్ ని టార్గెట్ చెయ్యడం తని ఒరువన్ లో లేదు, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో సురేందర్ రెడ్డి చాలా స్టైలిష్ గా సినిమా తీసాడు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమా క్వాలిటీ సూపర్బ్ గా సెట్ అయ్యాయి. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది.

నటీనటుల పనితీరు:

రామ్ చరణ్ : ఈ సినిమాతో రామ్ చరణ్ యాక్టింగ్ లో మరో మెట్టు పైకి ఎక్కాడు, యాక్షన్ సీన్స్ , డాన్స్ లలో ఎప్పటిలాగే అదరగొట్టాడు.

అరవింద్ స్వామి: సినిమాకి అరవింద్ స్వామి క్యారెక్టర్ యే స్పెషల్ అట్రాక్షన్, సిద్దార్థ్ అభిమన్యు క్యారెక్టర్ లో అరవింద్ స్వామి చేసినట్టుగా మరొకరు చేయలేరు,

రకుల్: ఈ సినిమాలో రకుల్ సూపర్ స్టైలిష్ గా చేసింది,

నవదీప్: నవదీప్ ఈ సినిమాలో గౌతమ్ అనే ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసాడు, తన యాక్టింగ్ టాలెంట్ తో ఆ క్యారెక్టర్ కి
న్యాయం చేసాడు.

సినిమాలో నటించిన అందరు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.

ప్లస్ పాయింట్స్:

  • కథ, స్క్రీన్ ప్లే
  • ధృవ, సిద్దార్థ్ అభిమన్యు క్యారెక్టర్లు
  • సినిమాటోగ్రఫి
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్

అలజడి రేటింగ్ : 3.25/5

పంచ్ లైన్ : ధృవ శత్రువే ఈ సినిమా హీరో

(Visited 4,039 times, 1 visits today)