నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా డిక్టేటర్. శ్రీవాస్ దర్శకుడు. వినాయక చవతి కానుకగా డిక్టేటర్ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. ఈలోగా చిత్రం ఫస్ట్ లుక్ బయటికి వచ్చింది. కొద్ది సేపటి క్రితమే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. టైటిల్ కు తగ్గట్టే యమ గ్రాండియర్ గా వుంది బాలయ్య లుక్కు. డిక్టేటర్ లో వినాయకుడి నేపథ్యంలో సాగే ఓ పాట ఉంది. రేపు ఈ పాట బయటికి రానుంది. ఈలోగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అభిమానులను ఖుషి చేశాడు బాలయ్య. ఇందులో బాలయ్య లుక్ చూస్తుంటే.. ఇంటర్నేషనల్ డాన్‌ను తలపిస్తున్నాడు. సాధారణంగా కోన వెంకట్, గోపీ మోహన్ కథ అందిస్తున్నారంటేనే. ఏదో ఇది కామెడీ చిత్రం అనుకుంటారు. అయితే ఇది బ్యాక్‌డ్రాప్ బేస్ డాన్ కథ అనే ప్రచారం వుంది. ఎన్టీఆర్ బాద్‌షాలా. ఈ సినిమా కూడా ఓ భాగం సీరియస్‌గానూ. మరో భాగం కామెడీతో కూడుకుని వుంటుందని .. అందులో భాగంగానే ఫస్ట్ లుక్ లొ ఉన్న బాలయ్య అలా రాయ గా ఉన్నాడని వుందని తెలుస్తోంది.
Must Read: బాలకృష్ణ , రజినికాంత్ మధ్య పోటి.
మరో విశయం ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇవాళ సాయంత్రమే విడుదల కానుంది. ఖైరతాబాద్ వినాయకుడి సమక్షంలో ఈ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలిసింది. వినాయకుడి మీద వచ్చే ‘గం.. గం.. గణేశ’ అనే సాంగును విడుదల చేయున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. లయ్య పక్కన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పే డైలాగులు బాణంలా ననదమురి అభిమానుల హృదయాలలోకి దూసుకు పోతాయని దర్శకుడు శ్రీ వాస్ చెపుతున్నాడు. నీతి తప్పిన సమాజానికి నియంతలా మారిన పాత్రలో బాలకృష్ణ ఈ సినిమాలో అధ్బుతం గా నటిస్తున్నాడని టాక్. ఇప్పటివరకు బాల కృష్ణ సినిమాలకు సంబంధించి ఉన్న రికార్డుల్ని తిరగరాసేలాఈ సినిమా ఉంటుందని ఈ సినిమా యూనిట్ చెపుతోంది. ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా కోసం కొనవెంకట్ అందించిన కధకు శ్రీధర్ రాసిన డైలాగులు ఈ సినిమాకు హైలెట్ గా మారుతాయి అని అంటున్నారు. రాబోతున్న సంక్రాంతికి రాబోతున్న డిక్టేటర్ పై ఇప్పటికీ బయ్యర్లలో మంచి క్రేజ్ ఏర్పడటంతో ఈ సినిమా బాలకృష్ణ రికార్డులను బ్రేక్ చేస్తుందని అంటున్నారు.
కొసమెరుపేంటంటే అయితే డిక్టేటర్ ఫస్ట్ లుక్ పై నందమురి తారక రామారావు నటించిన ‘గజదొంగ’ సినిమా లుక్ ని పోలి ఉందని కొందరనుకుంటున్నారు.