Home / Political / దిగ్విజయ్”యంగా పెళ్ళయ్యింది.

దిగ్విజయ్”యంగా పెళ్ళయ్యింది.

Author:

కాంగ్రెస్ సీనియర్ లీడర్, AICC జనరల్ సెక్రెటరీ, ఏపీ అఫైర్స్ ఇంచార్జ్ దిగ్విజయ సింగ్ పెళ్ళికొడుకయ్యారు.. ఎంతో కాలంగా తన గర్ల్ ఫ్రెండ్ ఐన టీవీ యాంకర్ అమృతారాయ్ ని తమిళనాడులో ఆగస్టు లోనే వివాహం చేసుకున్నారు. కాస్త ఆలస్యంగానే ఐనా ఈ కొత్త జంట ఎట్టకేలకు తమ పెళ్లి విషయని చెప్పేసి నిన్నంతా టీవీ ల్లో హాట్ న్యూస్ అయ్యారు.  సమాచారం ప్రకారం  44 ఏళ్ళ అమృతతో గత ఒకటిన్నర సంవత్సరం నుండీ సహజీవనం సాగిస్తున్న 68 ఏళ్ళ దిగ్విజయ్ సింగ్ ల వివాహం హిందూ పద్దతిలోనే  జరిగిందని తెలుస్తోంది .

అమృతారాయ్ ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ వాల్ పై ఒక్ సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. గతకొంత కాలం గా సైబర్ నేరా లకు బలైన మహిళగా, ఎంతో వ్యధా బరిత జీవితం గడిపినత్తుగా ఆమె చెప్పుకున్నారు. దిగ్విజయ్ గత ఏడాది ఏప్రిల్లో నే అమృత తో తన సంబందాన్ని అంగీకరించారు. దిగ్విజయ్ సింగ్ భార్య ఆశా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాదపడుతూ గత సంవత్సరంమే మరణించారు. ఆయనకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దిగ్విజయ్ కూడా అమృత తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత వివాహం చేసుకున్నాం అని ట్వీట్ చేశాడు.

అమృత ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్: “స్నేహితులందరికీ..! మీకో ఆనందకర వార్త చెప్పాలనుకుంటున్నాను. దిగ్విజయ్ తో నా పెళ్ళి ఇవాళే హిందూ వివాహ పద్దతిలో జరిగింది. మేము మా వివాహాన్ని రిజిస్టర్ కూడా చేసుకున్నాము.ఈమధ్య కాలం లో గత ఒకటిన్నర సంవత్సర కాలం గా సైబర్ క్రైం బాదితురాలిగా నేను మానసికంగా కుంగిపోతున్నప్పుడు నాకు అండగా నిలిచిన మిత్రులందరికీ కృతఙ్ఞలు చెప్పాలనుకుంటున్నాను. నిజానికి నేను బాదితురాలిని., కానీ నేనే నేరస్తురాలిని అన్నంత ధారుణం గా చూసారు.నేను చేయని నేరానికి సోషల్ మీడియాలో నన్ను చెప్పలేని భాషలో మాట్లాడారు. కానీ నేను నాపై నాకు ఉన్న నమ్మకం తోనూ దిగ్విజయ్ పై ఉన్న ప్రేమ తోనూ జయించాను, వాటిపై ఏమాత్రం వ్యతిరేకంగా స్పందించకుండా నా పని నేను చేసుకుంటూ పోయాను.

మా ఇద్దరి మధ్య ఉన్న వయోభేదం చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ. నేను నా అస్తిత్వం కోసం నా ఆనందం కోసం ఏం చేయాలో నిర్ణయించుకునేంత గా ఎదిగాను అనే అనుకుంటున్నా. మనం ఆధునిక, అభ్యుదయ దేశం లో నివసిస్తున్నాం. ఒక మహిళ గా నాకోసం నేను నా సొంత జీవితానికి సంబందించిన నిర్ణయాలు తీసుకునే హక్కు నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఒక మహిళగా నా కెరీర్ ని నిర్మించుకునేందుకూ. నాకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకునేనుదుకూ ఎంతగానో కష్ట పడ్డాను. నేను నా ఉధ్యోగ భాద్యతలనూ, నా కుటుంబ వ్యవహారాలనూ నా సొంత భుజాల పై మోయగలననే నమ్మకం ఉంది.

నేను దిగ్విజయ్ ని పెళ్ళి చేసుకోవటానికి కారణం కేవలం అయన మీద ఉన్న ప్రేమ మాత్రమే. అది స్పష్టం చేయటానికే మా పెళ్ళికి ముందే ఆయన ఆస్తులనీ, డబ్బునీ ఆయన కుమారుడు,కుమార్తెల పేరా మార్పించాను. నేను కేవలం నా పనీ ఇంకా నా ఆత్మ విస్వాసంతోనే ఆయనతో నా కొత్త జీవిత ప్రయాణాన్ని సాగించాలనుకుంటున్నాను. మరొక్క సారి అందరికీ కృతఙ్ఞతలు… ”

 

(Visited 82 times, 1 visits today)