Home / Entertainment / దిల్ రాజు కోరిక తీరేనా

దిల్ రాజు కోరిక తీరేనా

Author:

టాలీవుడ్ లో దిల్ రాజు స్టామినా ఏంటో అందరికీ తెల్సిందే. నిర్మాతల్లో సూపర్ స్టార్ గా పిలవ బడే ఫ్రెండ్లీ మ్యాన్. ఎన్నో సక్సెస్ ఫుల్ క్లీన్ ఎంటర్టైన్మెంట్స్ తీసి అశ్లీలత లేకుండా కూడా  సినిమా తీయొచ్చని నిరూపించిన  ఈ స్టార్ ప్రొడ్యూసర్ కీ ఒక కోరిక కలిగింది. సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టు లో మహేష్ వెంకీ ల కాంబినేషన్ తో మల్టీస్టారర్ అంటేఅనే కత్తిమీద సాము అన్న అభిప్రాయాన్ని పోగొట్టిన దిల్ రాజు ఇప్పుడు ఇంకో మల్టీ స్టారర్ మూవీ కి ప్లాన్ చేస్తున్నారట. అదీ టాలీవుడ్ మెగా పవర్ బ్రదర్స్ తో. “ఖచ్చితంగా మెగా బ్రదర్స్ తో ఒక సినిమా చేస్తాను. అది
ఒకరకంగా ఇప్పుడు నా గోల్” అని తన సన్నిహితుల తో చెప్తున్నారట ఈ డేరింగ్ ప్రొడ్యూసర్. ఐతే ఇంకా ఈ సంగతి చిరు తో చెప్పనప్పటికీ ఆయన ఈ విశయం లో దిల్ రాజు సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో రిలీజ్ లో మాట్లాడుతూ “అతని లోని కమిట్మెంట్ నాకు చాలాఇష్టం అవకాశం ఉంటే దిల్ రాజు తో ఒక సినిమా చేయాలనుంది” అని స్టేజ్ మీదె దిల్ రాజుని ప్రశంసించారు చిరు. దీన్నే గ్రీన్ సిగ్నల్ గా భావించి తన ప్రయత్నాలు మొదలు పెడుతున్నారట దిల్ రాజు.  ఇప్పటికే రాజకీయాలనుంచి కొంత బ్రేక్ కావాలనీ, ఇక పై మళ్ళీ సినిమాల్లొ నటించటానికి సిద్దంగా ఉన్నానని చిరు చెప్పగానే. టాలీ వుడ్ నిర్మాతలంతా ఆయనతో ఒక్క సినిమా ఐనా చేయటానికి రెడీ ఐపోయారు. చిరు కోసం కథలు తయారు చేయిస్తున్నారు. కానీ తన తర్వాతి చిత్రానికి నిర్మాత తన తనయుడే అని చిరు ప్రకటించాక కాస్త వెనక్కి తగ్గినా. తర్వాతి చిత్రాలకి ఐనా చిరు ని
ఒప్పించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సర్దార్ తర్వాత దాసరి నిర్మాణం లోఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు పవర్ స్టార్. అది పూర్తవగానే దిల్ రాజు తో చేయటానికి సిద్దంగా ఉన్నారు. అదే సినిమాని అన్నదమ్ములిద్దరితో తీసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి ఇన్నేళ్ళైనా శంకర్ దాదా జిందాబాద్ లో ఒక చిన్న సన్నివేశం తప్ప ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ ఎక్కడా కలిసి కనిపించలేదు.”మరణ మృదంగం”, “కొండవీటి దొంగ” లాంటి సినిమాల్లో నాగ బాబు అన్నయ్యతో చేసినా, తర్వాత పవన్ చిరు ల కాంబినేషన్ లో అలాంటి సాహసం ఎవరూ చేయలేక పోయారు. ఏ చిన్న తప్పు జరిగినా అభిమానులనుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందేమోనన్న భయం, ఇద్దరు స్టార్లని హాండిల్ చేయగలమా అన్న డైరెక్టర్ల వెనకడుగూ.., అసలా వైపే ఆలోచించకుండా చేసాయ్.

ఐతే మొన్న చిరు 60 పుట్టిన రోజు వేడుకల సంధర్బంగా  అన్నదమ్ములిద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు పోయి కలిసిపోయినట్టే అన్న వార్తలు వచ్చాయ్ కాబట్టి. ఎటూ చిరు కూడా అందరి ముందే రాజు తో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి. దిల్ రాజు కోరిక తీరే రోజు దగ్గర్లోనె ఉండొచ్చని ఆశిద్దాం

(Visited 74 times, 1 visits today)