Home / Devotional / సప్తమి తిధి, శ్రవణ నక్షత్రం కలిసివస్తున్న ఈ సోమవారం రోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాల ఉపవాస ఫలితం దక్కుతుంది.

సప్తమి తిధి, శ్రవణ నక్షత్రం కలిసివస్తున్న ఈ సోమవారం రోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాల ఉపవాస ఫలితం దక్కుతుంది.

Author:

కార్తీక మాసం శివుడుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని సోమవారాలు ఉపవాసం ఉండి దైవాన్ని కొలుస్తారు. కానీ ఈసారి కార్తీక మాసంలో వస్తున్న రెండవ సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది. సప్తమి తిధిలో, శ్రవణ నక్షత్రం రోజున సోమవారం రావాడం చాలా అరుదు. ఏంతో విశిష్ట ముహుర్తంలో వస్తున్న ఈ సోమవారాన్ని కోటి సోమవారాం అని కూడా అంటారు. ఆ కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని ఉవాచ. అందుకే ఈ నవంబర్ 7 న వచ్చే కోటి సోమవారం రోజు ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి.

karthika-somavaram

ఈ కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానాదులు కూడా అత్యంత విశిష్టమైనదే. నదీ స్నానం,ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో అచరించదగ్గ విధులు. కార్తీక మాసంలో శ్రీమహా విష్ణువు చెరువులలో, దిగుడు బావులలో ,పిల్లకాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలో గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలైన నదులన్నింటి నీరూ ఉరిందని భావించాలి. ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దానిక ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉన్నత ఫలితాలు కలుగుతాయి.

(Visited 21,977 times, 1 visits today)