Home / Political / జల్లికట్టు, కోడిపందాల పై నిషేదం సమంజసమేనా?

జల్లికట్టు, కోడిపందాల పై నిషేదం సమంజసమేనా?

Author:

తమిళ ప్రజలు పట్టిన పట్టు విడవడం లేదు..తమ సాంప్రదాయ క్రీడ జల్లికట్టుపై విధించిన నిషేదాన్ని ఎత్తివేసే వరకు తమ ఆందోళనలు ఆగవని తెలుపుతున్నారు. గత నాలుగు రోజులుగా అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, సినిమా హీరోలు, విద్యార్దులు వీధులలోకి వచ్చి సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తమ నిరసన ను తెలుపుతున్నారు. చెన్నై లో పరిస్తితి ఉద్రిక్తంగా మారుతుంది. మెరీనా బీచ్ మొత్తం నిరసనకారులతో నిండిపోయింది. జల్లికట్టుకు మద్దతుగా సినిమా హీరోలు రంగంలోకి దిగడంతో పరిస్తితి ఒక్కసారిగా మారిపోయింది. జల్లికట్టు ఆడటం తమిళనాడులో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అని, కానీ జల్లికట్టు ద్వారా జంతువులకు హాని కలుగుతుందని కొందరు అనవసరంగా వదంతులు సృష్టిస్తున్నారు అని పలువురు సినిమా హీరోలు పేర్కోన్నారు. జల్లికట్టు పై నిషేదం విధించడానికి కారణం అయిన “పెటా( ఫేటా)” సంస్థను దేశం నుండి బహిస్కరించాలని నిరసనకారులు తెలుపుతున్నారు. అందోళనలు ఉదృతం కావడంతో ఈరోజు చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలలో సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

jallikattu జల్లికట్టు

తమిళనాడులో జల్లికట్టుపై నిషేదం విధించినట్లుగానే తెలుగు రాష్ట్రాలలో కోడిపందాలపై కూడా నిషేదం ఉండి. ఇవి రెండు క్రీడలు వేల యేళ్ళుగా మన పండగ సంస్కృతిలో భాగమయ్యాయి. కాని ఇప్పుడు కోర్టులు జంతువులకి ప్రాణహాని పేరుతో ఈ ఆటలను నిషేధించడం సామాన్య ప్రజలకు మింగుడు పడటంలేదు. కోడి పందాలపై నిషేదం ఉన్నా మొన్న సంక్రాంతికి ఆంధ్రాలో కోడిపందాలు యధేచ్చగా సాగాయి, ఇప్పుడు తమిళనాడు లో కూడా జల్లికట్టు ఆడుతున్నారు. ప్రజల మద్దతు లేకుండా, వారి ఇష్టాలకు వ్యతిరేకంగా పాలకులు, కోర్టులు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అవి ఆచరణలో సాధ్యం కావు అని జల్లికట్టు, కోడిపందాలపై నిషేదాన్ని చూస్తే తెలుస్తుంది. వేరే దేశాలలో జంతువులపై ఎన్ని దాడుల జరుగుతున్నా పట్టించుకోని అంతర్జాతీయ సంస్థలు మన దేశ సంప్రాదాయలను మట్టికరిపించాలనే ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని వాదిస్తున్నారు సాంప్రదాయవాదులు. ఇంతకి జల్లికట్టు నిషేదంపై మీ స్పందన ఏమిటి?

(Visited 160 times, 1 visits today)