Home / health / డాక్టర్లు, నర్సుల ద్వారానే కొత్త రోగాలు వస్తున్నాయి…!

డాక్టర్లు, నర్సుల ద్వారానే కొత్త రోగాలు వస్తున్నాయి…!

Author:

జబ్బుచేస్తే ఆసుపత్రికి పోతాము మరి ఆ ఆసుప్రతుల వలనే కొత్త జబ్బులు వస్తే? ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా, కాని అపరిశుభ్రమైన ఆసుపత్రి పరిసరాలు, డాక్టర్లు, నర్సులు దరించే కోటు(ఏప్రన్) ల వలన కూడా రోగులకు కొత్త వ్యాదులు వస్తున్నాయని ఓ అధ్యయనం ద్వారా తెలిసింది. ఆసుపత్రుల్లో నర్సులు, డాక్టర్లు మరియు ఇతర సిబ్బంది దరిస్తున్న కోట్లు, యూనిఫార్మ్ లలో హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్ ఉంటున్నాయని, వీటివల్ల కొత్త ఇన్ఫెక్షన్ సోకి రోగులకు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని ఆ అధ్యయనంలో తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది యాంటీ బయాటిక్స్ వాడినా కూడా వారు ధరిస్తున్న 94% ఏప్రన్లలో కాలుష్యకారకమైన మరియు వ్యాదికారక బ్యాక్టీరియా ఉంటొందట. అదేకాకుండా డాక్టర్లు వాడే స్టెతస్కోపుల్లో, పెన్నులు మరియు ఇతర పరికరాల మీదా కూడా వ్యాదికారకాలైన మైక్రో-ఆర్గానిజమ్స్ ఉంటున్నాయని తెలిసింది.

doctor aprons containing bacteria

ఈ బ్యాక్టీరియా పెరగడానికి కారణం మాత్రం ఆసుపత్రి సిబ్బంది అలసత్వమే, చాలా మంది ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు తమ యూనిఫార్మ్ ని మరియు ఏప్రన్ లను రెండు వారాలకు ఒకసారి కూడా శుభ్రం చేయడం లేదట. ఇందులో 20% మందికి తమ బట్టలలో రోగకారక బ్యాక్టీరియా ఉంటుందన్న విషయం కూడా తెలియదట. అంతే కాకుండా చాలా మంది ఆసుపత్రి సిబ్బంది తమ డ్యూటీ అయిపోయిన తర్వాత తమ ఆసుపత్రి యూనిఫార్మ్ దరించే ఇంటికి వెలుతున్నారు దీనివల్ల కూడా బయటి బ్యాక్టీరియా వారి దుస్తుల ద్వారా మళ్ళీ ఆసుపత్రికి చేరుతుంది. ఇకనుండైనా ఆసుపత్రి సిబ్బంది పొడవు చేతులున్న కోట్లను ధరించడం సాధ్యమైనంతవరకు తగ్గించాలని, రోగులను చూసే ముందు, తరువాత తమ చేతులు శుభ్రం చేసుకోవాలని, అలాగే తమ కోట్లను రోజూ ఉతికి శుభ్రపరచాలని ఆ అధ్యయనంలో సూచించారు. అందుకే ఉన్నదానికి లేనిదానికి ఆసుపత్రికి పోయి..కొత్త రోగాలు తెచ్చుకోకండి.

(Visited 690 times, 1 visits today)