మన శరీర బరువు తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, చాలా శ్రమతో కూడుకున్న పని వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బరువు తగ్గటం కోసం చేసే ప్రయత్నాల్లో చాలా వరకు మనకు సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చి పెట్టేవే ఉంటాయి.
ఎంతగా సాధన చేసిన బరువు తగ్గటం వెంటనే తగ్గటం జరగదు. ఇప్పుడు పరిశోధకులు ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా ఆరోగ్యం పెంపొందుతూ బరువు తగ్గొచ్చని తెలుపుతున్నారు.శరీర బరువు తగ్గించుకోవటానికి రక్తదానం చాలా ఉత్తమ మార్గమట.
రక్తదానం చేయటం మనకు రెండు విధాలుగా ఆరోగ్యానికి మంచిదని తాజా అధ్యయనం తెలిపింది. రక్తదానం చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
ఒకసారి రక్తదానం చేయటం వలన 650కేలరీల బరువు తగ్గటం జరుగుతుందట. ఇంకా, రక్తదానం చేయటం మూలంగా శరీరంలోని బ్లడ్ ఆక్సిడ్స్ బయటకు వెళ్ళటంతో పాటుగా గుండె సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట.
మీరు ఇతరుల కోసం చేసే రక్తదానం వల్ల వారికే కాకుండా మీకు కూడా చాలా ఆరోగ్యకరం. ఇకపై రక్తదానం చేసే విషయంలో అపోహలకు లోనై వెనకడుగు వేయకండి. షేర్ చేసి నలుగురికి తెలియజేయండి.