తిరుమలలో భక్తులకు ఓ వింత కనిపించింది. భక్తులతో పాటు.. ఓ కుక్క మెట్లమార్గంలో శ్రీవారి సన్నిధికి చేరుకుంది. కొంతమంది భక్తుల బృందంతో పాటు.. తిరుపతికి వచ్చిన శునకం… వేంకటేశుడి సన్నిధానానికి మెట్ల మార్గంలో చేరుకుంది.తమిళనాడులోని ఓ భక్త బృందంతో కలిసి శ్రీవారి ఆలయం వరకు వచ్చింది కుక్క. మొత్తం నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తిరుమలకు చేరుకుంది ఆ భక్త బృందం.
వారితోపాటు.. ఆ కుక్క కూడా అన్ని ఊళ్లు తిరిగి.. తిరిగి.. తిరుమల కొండకు వచ్చింది. తాము నడుస్తున్నప్పుడు నడిచిందని.. ఆగినప్పుడు ఆగిందని.. తాము పడుకున్నప్పుడు పడుకుందని చెప్పారు కుక్కతో పాటు వచ్చిన భక్తులు. కేవలం బిస్కెట్లు మాత్రమే తింటూ తిరుమలకు వచ్చిందని చెప్పారు.ఆలయంలోని ప్రవేశించకుండా సెక్యూరిటీ కుక్కను అడ్డుకున్నారు.
కొండపై జి.ఎన్.సి. టోల్ గేట్ దగ్గర భక్తులతో పాటు సేద తీరింది శునకరాజం.