Home / Inspiring Stories / రూ. 10 నాణెం చెల్లదంటూ వస్తున్న వదంతులను నమ్మకండి.

రూ. 10 నాణెం చెల్లదంటూ వస్తున్న వదంతులను నమ్మకండి.

Author:

గత కొన్ని రోజులుగా 10 రూపాయల నాణేలను రద్దు చేసారని, అవి ఇక చెల్లవన్న ప్రచారం జోరుగా సాగుతుంది దాని పర్యావసానంగా చాల మంది చిన్న వ్యాపారులు 10 రూపాయల నాణేలను తిరస్కరిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారులు, కొన్ని పెట్రోల్ బంకులలో కూడా 10 రూపాయల నాణేలను స్వీకరించడంలేదు. ఎట్టకేలకు దీనిపై వివిధ బ్యాంకుల అధికారులు స్పందించారు. 10 రూపాయల నాణేలను రద్దు చేసారన్న వార్త పూర్తి అవాస్తవమని, ఎవరో కావాలనే ఈ వదంతులను చేస్తున్నారని ప్రకటించారు బ్యాంకు అధికారులు. మీకు అంతగా నమ్మకం లేకుంటే బ్యాంకుకు వచ్చి మీ దగ్గర ఉన్న రూ. 10 నాణేలను ఇచ్చి నోట్లు పొందవచ్చని అంతేకాని ఇలా వదంతులు నమ్మి మోసపోవద్దని, తక్కువ ధరకు మీ దగ్గర ఉన్న నాణేలను ఎవరికి ఇవ్వద్దని తెలిపారు బ్యాంకు అధికారులు.

10 rupee coins are not banned

ఈ వదంతి విశాఖపట్నం లో భారిగా ప్రాచుర్యం పొందింది, ఎక్కడైనా 10 రూపాయల నాణెం ఇస్తే ఎగాదిగా చూస్తున్నారు. చాలా మంది వ్యాపారులు 10 రూపాయల నాణేలకు బదులు 10 రూపాయల నోటు ఇవ్వాల్సిందిగా సూచిస్తున్నారు. 10 రూపాయల నాణేలు రద్దు కాలేదని వాటిని తీసుకోవాలని రైతు బజార్లలో అధికారులు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారంటే వదంతుల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. పరిస్తితి చేయి దాటక ముందే స్పందించిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌, పది రూపాయల నాణేలను రద్దు చేయలేదు ఎవరైనా వాటిని తీసుకోకపొతే అధికార్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఏది ఏమైన కొత్త 10 రూపాయల నోట్లను తీసుకువస్తున్నామన్న ఆర్బీఐ ప్రకటణ పాత 10 రూపాయల నాణేల చావుకు వచ్చింది.

(Visited 6,172 times, 1 visits today)