Home / Inspiring Stories / లెక్కచెప్పని డబ్బు 2.5 లక్షల కన్న ఎక్కువ మీ అక్కౌంట్లో ఉంటే మీరు ఎంత పన్ను కట్టాలో ఇక్కడ చూడండి.

లెక్కచెప్పని డబ్బు 2.5 లక్షల కన్న ఎక్కువ మీ అక్కౌంట్లో ఉంటే మీరు ఎంత పన్ను కట్టాలో ఇక్కడ చూడండి.

Author:

500, 1000 నోట్ల రద్దు విషయం నుండి జనం తేరుకోకముందే ఆదాయ శాఖ మరో బాంబు పేల్చింది. ఇకనుండి ప్రతి వ్యక్తి అక్కౌంట్లో 2 లక్షల 50 వేల పైన డబ్బు ఉంటే ఆ డబ్బుకు లెక్క చెప్పాల్సిందే అని నిభందన జారి చేసింది. 2 లక్షల 50 వేల రూపాయలు అక్కౌంట్లో ఉంటే ఆదాయ శాఖాకు ఎటువంటి పన్ను కట్టవలసిన అవసరంలేదు, కాని మీ అక్కౌంట్లో 2 లక్షల 50 వేల రూపాయల కన్న ఎక్కువ డబ్బులుండి అవి ఎలా సంపాదించారో అధారాలు చూపకపొతే ఆదాయ శాఖ మీ నుండి కింద చెప్పిన విధముగా పన్ను మరియు పెనాల్టీ వసూలు చేస్తుంది. అందుకే ఆధారాలు లేకుండా ఇతరుల డబ్బును మీ అక్కౌంట్లో వేసుకోకండి.

tax

2.5 లక్షల డిపాజిట్ల పై ఎటువంటి పన్ను కట్టవలసిన అవసరం లేదు.

5 లక్షల డిపాజిట్ల పై:
మొదటి 2.5 లక్షలకు పన్ను మినహాహింపు
రెండవ 2.5 లక్షలకు 10% పన్ను= 25 వేలు
పెనాల్టీ 200%= 50 వేలు
మొత్తం చెల్లించాల్సిన పన్ను= 75 వేలు

10 లక్షల డిపాజిట్ల పై:
మొదటి 2.5 లక్షలకు పన్ను మినహాహింపు
రెండవ 2.5 లక్షలకు 10% పన్ను= 25 వేలు
మిగిలిన 5 లక్షలకు 20% పన్ను= 1 లక్ష
పెనాల్టీ 200%= 2 లక్షల 50 వేలు
మొత్తం చెల్లించాల్సిన పన్ను= 3 లక్షల 75 వేలు

20 లక్షల డిపాజిట్ల పై:
మొదటి 2.5 లక్షలకు పన్ను మినహాహింపు
రెండవ 2.5 లక్షలకు 10% పన్ను= 25 వేలు
తర్వాత 5 లక్షలకు 20% పన్ను= 1 లక్ష
తర్వాత 10 లక్షలకు 30% పన్ను= 3 లక్షలు
పెనాల్టీ 200%= 8 లక్షల 50 వేలు
మొత్తం చెల్లించాల్సిన పన్ను= 12 లక్షల 75 వేలు

ఈ లెక్క ప్రకారం 50 లక్షల డిపాజిట్ల పై 39 లక్షల 75 వేలు మరియు కోటి రూపాయల డిపాజిట్ల పై 84 లక్షల 75 వేల రూపాయలను ఆదాయ శాఖ వారికి పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులన్ని లెక్కలు చెప్పని అమౌంట్ పైననే కట్టాల్సి ఉంటుంది. మీ దగ్గర మీరు డిపాజిట్ చేసే అన్ని డబ్బులకు అధారాలు ఉంటే మీరు నిశ్చింత గా ఉండొచ్చు.

(Visited 33,604 times, 1 visits today)