Home / Latest Alajadi / RIP అని కామెంట్ పెట్టొచ్చా?

RIP అని కామెంట్ పెట్టొచ్చా?

Author:

ఒక వ్యక్తి మరణించారనే వార్త ఫేస్ బుక్ లేదా ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాలలో కనిపించగానే వెంటనే RIP అని కామెంట్ పెట్టడం మనందరికీ అలవాటుగా మారింది. కానీ, అస‌లు ఆ ప‌దం వాడ‌కూడ‌ద‌ట‌. నిజంగా RIP అని ఎందుకు రాస్తున్నామో మనకే తెలియకుండానే గుడ్డిగా అనుసరిస్తున్నాం. అసలు దీనికి అర్థమేమిటని త‌ర‌చి త‌ర‌చి చూస్తే… RIP అంటే Rest in peace అని అర్థం. క్రైస్తవం ప్రకారం ఒక మనిషి మరణించాక, అతని ఆత్మ జడ్జిమెంట్ డే వరకు ఈ భూమిపైనే నిరీక్షించాలి. ఇస్లాం ప్రకారం కూడా చనిపోయిన వారి ఆత్మ ఒక రోజు వరకు నిరీక్షించాలి. అలా భూమిపైనే నిలిచిన ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని  ఈ RIP అర్దం.

dont use rip word

మరి సనాతన ధర్మం ప్రకారం ఆత్మ అనేది నాశనం లేనిది. ఆత్మకు అలసటే ఉండదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? అలాగే మరణానంతరం జీవి పాపపుణ్యాల్ని బట్టి, తరువాతి జన్మ పొందడమో, స్వర్గ నరకాలకు వెళ్ళడమో లేక మోక్షానికి వెళ్ళడమో లాంటి ప్రతి చర్యలుంటాయి. మోక్షం వరకూ ఇది ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. అంతేకానీ మనం ఏ రోజు గురించి నిరీక్షించాల్సిన అవసరం లేదు.

RIP అనేది పూర్తిగా పాశ్చాత్యమే కాక, మతాంతరం కూడా. మరణించిన వ్యక్తికి ముక్తి కలగాలనో, లేక స్వర్గస్తుడవ్వాలనో, శాశ్వత పుణ్య లోకాలు కలగాలనో మనం ప్రార్థించాలే తప్ప, RIP అని ప్రార్థించడం సనాతన ధర్మానికి వ్యతిరేకమని గుర్తించాలి. స్వ‌ర్గ ప్రాప్తిర‌స్తు అనుకోవాలి గాని, ఇలా RIP పెట్ట‌కూడ‌ద‌ట‌. ఇక ఇప్పటినుండి అయినా తొందరపడి అలా కామెంట్ పెట్టకండి.

(Visited 8,877 times, 1 visits today)