Home / Inspiring Stories / ఇకనైనా మారండి, కొత్త నోట్ల మీద ఎటువంటీ వ్రాతలు రాయకండి.

ఇకనైనా మారండి, కొత్త నోట్ల మీద ఎటువంటీ వ్రాతలు రాయకండి.

Author:

new-currency

నల్లధనాన్ని అరికట్టాలన్న ఉద్ద్యేశ్యంతో మరియు నకిలీ కరెన్సీ ఏరివేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ఈ రోజు భారతీయుల చేతిలోకి కొత్త 500, 2000 రూపాయల నోట్లు వచ్చాయి. ఈ సంధర్భముగా అందరికి ఒక విన్నపము, ఇంతకుముందు లాగా ఈ కొత్త కరెన్సీ నోట్ల మీదా పెన్నుతో ఇష్టం వచ్చినట్లు వ్రాయకండి. ఇంతకుముందు ఇలా వ్రాసిన నోట్లు చెల్లుబాటు అయ్యాయి కాని అలాంటి నోట్లని ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు సేకరించి, వాటి స్థానంలో కొత్త నోట్లు ప్రింట్ చేస్తున్నారు. దీనివల్ల రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారికి కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ఎవరో చేసిన పనికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 5 రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ నోటు ప్రింట్ చేస్తుంది. అందరు తమ నోట్లపై రాసుకుంటే పోతే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారికి ఎంత నష్టమో ఊహించుకోండి. అందుకే ఇకనైనా మీకు నోట్ల మీదా వ్రాసే అలవాటు ఉంటే అది మానడానికి ప్రయత్నించండి. దయచేసి ఇప్పుడు వస్తున్న కొత్త నోట్ల మీద ఎమి వ్రాయకుండా శుభ్రముగా ఉంచి కొత్త అధ్యాయానికి తెరతీయండి.

(Visited 1,690 times, 1 visits today)