Home / Inspiring Stories / ఒక్కొక్క ముడి వీడుతోంటే పీటముడి బిగుసుకుంటోంది.

ఒక్కొక్క ముడి వీడుతోంటే పీటముడి బిగుసుకుంటోంది.

Author:

Siricilla rajaiah latest news

కాంగ్రేస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసుకు సంబంధించిన చిక్కు ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకనే లేదు. సారికది హత్యా, అత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. అయితే, ప్రాథమికంగా ఉన్న ఆధారాలతో జరిగింది హత్య అనే నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజయ్య కుటుంబ సభ్యులను పోలీసులు వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ స్టేషన్లో ఉంచి పలు కోణాల్లో విచారిస్తున్నారు.శుక్రవారం రోజున నిందితులందరినీ పోలీసులు కోర్టులో హాజరు పరిచే అవకాశముంది. మరోవైపు, అనిల్, సారికల మధ్య విభేదాలకు కారణంగా భావిస్తున్న అనిల్ రెండో భార్య సన పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

2014 ఏప్రిల్‌లో సారిక ఇచ్చిన ఫిర్యాదు ను బట్టి చూస్తే ఆమె ని తీవ్రంగా వేదించినట్టు తెలుస్తోంది.తనను వేధించిన వారిలో భర్తతోపాటు మామ రాజయ్య, అత్త మాధవి, సనా కూడా ఉన్నారని సారిక తన ఫిర్యాదులో ఆరోపించింది. వీరు తనను పనిమనిషి కంటే హీనంగా చూస్తున్నారని తెలిపింది. అప్పటి కథనాల ప్రకారం పెళ్లయిన తర్వాత కొన్నేళ్లు బాగానే ఉన్నప్పటికీ సనా అనే యువతితో అనిల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పట్నుంచి వారి ఇంటి పైఅంతస్తులో సారికను విడిగా ఉంచారు. వీటిని తాళలేక సారిక కోర్టును ఆశ్రయించింది. వరంగల్‌లో రాజయ్య తన రాజకీయ పలుకుబడితో కేసును నీరుగారుస్తారని, ఈ కేసును తాను వివాహం చేసుకున్న మారేడ్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంతానికి సిఫారసు చేయాలని సారిక అప్పీలు పెట్టుకుంది…

ఇక ఈ మరణాల అనంతరం జరిపిన విశయాలలో సారిక, ముగ్గురు పిల్లల దేహాలను చూస్తే పెట్రోల్ మీద పడి నిప్పుతో కాలినట్లు అర్థమవుతోందని అంటున్నారు. అయితే, సారిక పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పటించి, తాను నిప్పటించుకుందా అనేది ఒక కోణం కాగా, ఆ నలుగురిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారా అనేది మరో కోణం. సారిక పిల్లల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. సారికకు మత్తుమందు ఇచ్చి బెడ్‌పై కాల్చేశారని, ఆ తర్వాత పిల్లలను చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. బెడ్రూంలో ఉన్న గ్యాస్ లీక్ కాలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సిలిండర్‌లో గ్యాస్ కూడా లేదని, అక్కడ స్టౌవ్ కూడా లేదని చెబుతున్నారు. సారిక శరీరం ముందుభాగం మాత్రమే కాలిపోయింది. పిల్లలు కాలిపోయిన తీరును బట్టి హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాస్ లీక్ కాలేదని క్లూస్ టీమ్ నిర్ధారణకు వచ్చింది. పోస్టుమార్టం నివేదిక రేపు గురువారం వచ్చే అవకాశం ఉంది. అది వస్తే పూర్తిగా మరణాలకు సంబంధించిన మిస్టరీ వీడవచ్చునని భావిస్తున్నారు. రాజయ్య కుటుంబ సభ్యులను పోలీసులు బుధవారం నాడు విడివిడిగా విచారించారు.. సంఘటన అనంతరం నిన్న సారికతో పాటు చిన్నారులను చూసేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.రాజయ్య ఇంటి ఎదుట మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. సాయంత్రం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ సమయంలో మాంసం ముద్దల్లా మారిన ఆ నలుగురి శవాలను చూసి మహిళా సంఘాల నేతలు తట్టుకోలేకపోయారు. అప్పటికే రాజయ్య, కుటుంబ సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీస్ జీపులో కూర్చున్న రాజయ్య పైన దాడికి ప్రయత్నించారు.దాంతో పోలీసులు తమ వాహనం లో అక్కడినుంచి రాజయ్యని తరలించారు.మరోవైపు, అనిల్, సారికల మధ్య విభేదాలకు కారణంగా భావిస్తున్న అనిల్ రెండో భార్య సన పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

(Visited 280 times, 1 visits today)