Home / Reviews / డైనమెట్

డైనమెట్

విష్ణు manchu vishnu

Alajadi Rating

2.5/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: మంచు విష్ణు, ప్రణీత, జేడీ చక్రవర్తి

Directed by: దేవా కట్టా

Produced by: మంచు విష్ణు

Banner: 24 Frames

Music Composed by: అచ్చు

 దర్శకుడు గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న దేవా కట్టా మంచు విష్ణు ని యాక్షన్ స్టార్ గా చూపించేందుకు చేసిన ప్రయత్నం డైనమెట్ ఈరోజే విడుదలైంది. తమిళ చిత్రం “అరిమనంబి”కి రేమేక్ గా వచ్చిన ఈ సినిమాలో మాతృక కన్నా యాక్షన్ మోతాదు పెంచారు. మరి దేవా కట్టా ప్రయత్నం ఎంత ఫలించిందీ,మంచు విష్ణు కి ఈ సినిమా ఎంత వరకూ ప్లస్ ఔతుందీ అన్నది తేలిపోనుంది… ఈ చిత్రం పై ఒక రివ్యూ..

కథ: అనుకోని పరిస్తితులలో కలిసిన శివాజీ(విష్ణు)  అనామికా (ప్రణీత) కలిసిన తొలి పరిచయం లోనే ఒకరినొకరు ఇష్ట పడతారు.ఇద్దరూ డేట్ కోసం వెళ్ళిన సమయం లో. అక్కడ అనామిక ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. పోలీసులకు సమాచారం అందించినా అసలు అనామిక కిడ్నాప్ ని నిరూపించే ఒక్క ఆధారమూ ఉండక పోవటం తో పోలీసులు అతని మాటను నమ్మరు. . తానే స్వయంగా అనామికని వెతకటం మొదలు పెడతాడు శివాజీ. అనామికని వెతికే ప్రయత్నంలో అతనికి దొరికిన ఒకే ఒక ఆధారం అనామిక మెమొరీకార్డు మత్రమే. ఆ మెమొరీ కార్దు మూలంగానే అనామిక చిక్కుల్లో పడిందనీ,ఆమె ప్రాణాలకే ముప్పు వచ్చేంత పెద్ద సమస్యలో ఇరుక్కుందనీ తెలుసుకుటాడు. ఇంతకీ ఆ మెమొరీ కార్డు లో ఏముందీ? అనామికని ఎందుకు,ఎవరు కిడ్నాప్ చేసారు? అసలా మెమొరీ కార్డ్ కీ రిషిదేవ్(జేడీ చక్రవర్తి)కీ సంబందమేంటీ? ఆ సమస్యలనుంచి శివాజీ అనామికను ఎలా కాపాడుకున్నాడూ? అన్నదే సినిమా కథ.  

నటీనటుల పర్ఫార్మెన్స్: ఈ సినిమా లో కొత్త లుక్ కోసం విష్ణు పడిన కష్టం తెరమీద సరైన ఫలితాన్నే ఇచ్చిందా అంటే అనుమానమే. బాడీ లాంగ్వేజ్ లోనూ,నటన లోనూ చక్కని పెర్ఫార్మెన్స్ ని చూపించాలనే ప్రయత్నించినా ప్రయత్నించాడు. మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకూ టాలీవుడ్ తెరమీద చూడని కొన్ని స్టంట్స్ ని విష్ణు ఎలాంటి డూప్ లేకుండా చేయటం. కానీ విష్ణు ప్రయత్నం నీళ్లలో వేసిన డైనమెట్టయ్యిందనే చెప్పాలి. విష్ణు ఎమోషనల్ సీన్లలో కూడా ఆకట్టుకున్నాడు. సినిమాకి ఉండే ప్లస్ పాయింట్లలో విష్ణు ఒకడు(డే) అనుకోవచ్చు.    

ఇక ప్రణీత విశయానికొస్తే నటన సంగతెలా ఉన్నా తన గ్లామర్ తో బాగానే ఆకట్టు కుందీ ఈ చేపకళ్ళ చిన్నది.నటింప చెయ్యలేనప్పుడు కనీసం అందాలతో అయినా ఆకట్టుకోవాలి కదా.  మాతృక లో చేసిన క్యారెక్టర్నే ఇక్కడ కూడా చేసిన జే.డీ. చక్రవర్తి నటన చూసిన వారెవరైనా హాట్సాఫ్ అనుకోవాల్సిందే.కానీ మాతృకలోంచే దృశ్యాలని కాపీ పేస్ట్ చేయకుండా ఉంటే ఇంకా బావుండేది.ఇక రాజా రవీంద్ర,నాగిరెడ్డి,ప్రవీణ్,పరుచూరి వెంకటేశ్వర రావు లు తమ పరిధుల్లో బాగా చేసారు.

 

విష్ణు machu vishnu

 

సాంకేతిక నిపుణులు: ఆటో నగర్ సూర్య లాంటి భారీ ఫ్లాప్ తర్వాత దేవా ఈసారి సరైన కథనీఈ పరిస్తితుల్లో అవసరమైన సబ్జెక్ట్ నీ ఎంచుకున్నా కాస్త తడబడ్డాడనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సో సో గా ఉండి మూడు పాట్లు కూదా యావరేజ్ గానే ఉన్నయి. సరైన టైమింగ్ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. సతీష్ ఫొటో గ్రఫీ సినిమా లో కీలక పాత్రవహించే విజయన్ ఫైట్స్ కూడా బాగున్నాయి.ఐతే కేవలం ఫైట్స్ వల్లే సినిమా ఆడదు.  

 

విశ్లేషణ: ఈ సినిమా స్క్రీన్ ప్లే దేవాకట్టా మరొక్కసారి చూస్కుంటే బావుండేది. యాక్షన్ సీన్లతో పాటు టైట్ స్క్రీన్ ప్లే ప్రేక్షకున్ని కదలకుండా కూర్చో పడుతుండి. కానీ ఆ యాక్షన్ కి కొన్ని బలమైన కారణాలున్నప్పుడే ఆ యాక్షన్ ఏపిసోడ్ ఆకట్టుకుంటుంది..అసలు విలన్ ఎవరూ అనేది రివీల్ అయ్యేదాకా నడిచే మైండ్ గేం బానే అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకున్ని కదలనివ్వవు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలూ స్నిన్మాని అంచనాలు మించి తీసుకెల్తాయి. యాక్షన్,థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ సిన్మా విపరీతంగా నచ్చుతుంది.  తమిళ చిత్రంలో ని పాట విజువల్స్ కి తెలుగు పాటను అతికించారు. చిత్రంలో దాదాపు నలభై శాతం కట్ – పేస్ట్ సన్నివేశాలు కాకుండా ఉంటే ఇకాస్తైనా బావుండేదేమో.

మంచు హీరోలిద్దరూ నిజానికి ప్రతి పాత్ర కోసం,ప్రతి సినిమాకోసం 100% కష్ట పడతారు కానీ సరైన కథ ఎంచుకోకుండా ఎంత కష్ట పడ్డా లాభం ఉండదు.

   

(Visited 68 times, 1 visits today)