Home / Political / ఎంసెట్- 2 ని రద్దు చేసి ఎంసెట్- 3 షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

ఎంసెట్- 2 ని రద్దు చేసి ఎంసెట్- 3 షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

Author:

ఎంసెట్ -2.. తెలంగాణలో వేలమంది విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులు సైతం ఎంతో వేదనకు గురిచేసిన ఒక అంశం! ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాసి మంచి మంచి ర్యాంకులు తెచ్చుకున్న ఎంతో మంది తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలుసుకుని షాకయ్యారు. అదే.. ఎంసెట్ 2 పరీక్షా పత్రం లీక్ అయ్యిందని. నాటి నుంచి నేటి వరకూ.. ఎంసెట్ 2 పై రకరకాల కథనాలు – ఊహాగానాలు. రద్దుచేయాలని కొందరు – రద్దువద్దని ఇంకొందరు.. ఎవరి అంచనాలు – ఆశలు ఎలా ఉన్నా.. ఎంసెట్ 2 పరీక్ష పై తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది.

ఎంసెట్- 2 ని రద్దు చేసి ఎంసెట్- 3 షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

ఎంసెట్- 2 పరీక్షని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ వెంటనే ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల చేసింది, సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది, ఎంసెట్- 2 పరీక్షకి అప్లై చేసిన విద్యార్థులు పాత హాల్ టికెట్స్ తోనే పరీక్షని రాయవచ్చని, మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు, విద్యార్థులు కోసం జేఎన్టీయూ వెబ్ సైట్ లో స్టడీ మెటీరియల్ ని అందుబాటులో ఉంచుతామని తెలిపారు, రెండు మూడు రోజుల్లో పూర్తి నోటిఫికేషన్ ని విడుదల చేస్తామని, విద్యార్థులు, తల్లి తండ్రులు సహకరించాలని సీఎం కెసిఆర్ తెలిపారు.

(Visited 174 times, 1 visits today)