Home / Inspiring Stories / నీటితో నడిచే కారుని కనిపెట్టిన రాజనగరం బీటెక్ కుర్రోళ్ళు …………

నీటితో నడిచే కారుని కనిపెట్టిన రాజనగరం బీటెక్ కుర్రోళ్ళు …………

Author:

ప్రస్తుతం నడుస్తున్న పోటీ ప్రపంచంలో రోజు రోజుకీ ద్విచక్ర వాహనాలూ, కార్లూ ఎక్కువగా పెరిగిపోతున్నాయి, వాటి మూలంగా ఇందనం కొరత మరీ ముఖ్యంగా విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం, ఇప్పుడు మనం దాదాపు దీనికి ప్రత్యామ్యాయం అలోచిన్చుకోవాల్సిన స్టేజి కి వచ్చాం. ఇవి మనసులో పెట్టుకునే రాజానగరం కుర్రోళ్ళు నీటిని ఇంధనంగా ఉపయోగించి, మామూలుగా పెట్రోలుతో నడిచే వాహనాల కంటే రెట్టింపు మైలేజీ ఇచ్చే కారును తయారు చేసారు. ఈ రోజుల్లో చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదివామా, పరీక్షలు రాసి పాసయ్యామా, కాంపస్ లో జాబు కొట్టామా ఇలానే ఉన్నారు కానీ తూర్పుగోదావరి జిల్లా గోదావరి ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఈ నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు మాత్రం వేరే, సమాజానికి ఉపయోగపడేది చేయాలని కష్టపడ్డారు.

హైడ్రాలిసిస్‌ పద్ధతిలో విడుదలైన హైడ్రోజన్‌ను ఉపయోగించుకుని ఇది పనిచేస్తుంది. లీటరు పెట్రోలుతో 25 కిలోమీటర్లు మైలేజ్‌ఇచ్చేలా ఈ కారుని తయారు చేసారు, హైడ్రోజన్‌ ఇంధనం పంపడం ద్వారా 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, వేగం విషయంలో గరిష్ఠంగా 40కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని తయారీకి కూడా పెద్దగా ఖర్చు ఏమీ కాదు సుమారుగా రూ.40 వేలు ఖర్చు ఇప్పుడు మార్కెట్ లో ఉన్న రేట్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ కింద లెక్కే మరి.

East Godavari Students Invented Water Powered Car

కారును తయారుచేసిన పొన్నమల రంజిత్‌, కోపెల్ల యోగేశ్వరదుర్గా ప్రసాద్‌, బండారు వీరవెంకట శ్రీనివాస్‌, నల్లమల హరీ్‌షబాబును ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ పెండ్యాల వీర్రాజు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీవీ రామ్మూర్తి, గైట్‌ ఎండీ కె.శశికిరణ్‌ వర్మ, చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ కె.వి.వి.సత్యనారాయణ అభినందించారు. ఏమైనా ఈ కుర్రోళ్ళు గ్రేట్ కదా, బవిష్యత్తులో మరిన్ని విజయాలు సాదించాలని కోరుకుంటూ అల్ ది బెస్ట్ చెప్దామా మరి.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)