Home / health / మాంసం ఎక్కువగా తింటున్నారా..? కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం ఉంది..!

మాంసం ఎక్కువగా తింటున్నారా..? కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం ఉంది..!

Author:

మాంసం అధికంగా తినడం వల్ల కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది, మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం, కిడ్నీ పనితీరు పై సింగపూర్ కి చెందిన వైద్య పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు, వీరు 60,000 మందిని ఎంచుకుని పరిశోధన చేశారు, ప్రోటీన్లు అధికంగా ఉండే మాంసం తిన్న వారిలో కిడ్నీల పనితీరు ప్రమాదంలో ఉందని గుర్తించారు, ఇంకా వీరి పరిశోధనలో తెలిసిన విషయం ఏమిటంటే చేపలు, గుడ్లు, డెయిరీ ఉత్పత్తులు, సోయా లాంటివి తిన్న వారికంటే పంది, మేక, గొర్రె, ఆవు మాంసం తిన్నవారిలో కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడైంది, మేక, గొర్రె లకి బదులు కోడి, చేపల మాంసం తినడం మంచిదని సూచించారు.

eating-excess-of-meant-will-affect-kidney

మేక, గొర్రె, పంది మాంసం తినడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుందని, అలా కొవ్వు పేరుకుపోవడంతో రక్త నాళాలలో రక్త ప్రసరణ తగ్గిపోతుందని, తద్వారా కిడ్నీలకి రక్తం తగ్గిపోయి వాటి పనితీరు ప్రమాదంలో పడుతుందని తెలిపారు, కిడ్నీ సమస్యలున్న వారు ఆకుకూరలు ఎక్కువగా తినాలని సూచించారు, ఒక వేళ ఎక్కువ మాంసం తిన్న కూడా దానికి తగ్గట్టు ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఎటువంటి ప్రమాదం రాదని చెప్పారు.

Must Read: శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని,విష పదార్థాలని 3రోజులలో తగ్గించుకోవచ్చు..!

(Visited 2,999 times, 1 visits today)