Home / Inspiring Stories / ఎవరీ హైదరాబాదీ ? ఏమా కథ?

ఎవరీ హైదరాబాదీ ? ఏమా కథ?

Author:

ఎవరీ హైదరాబాదీ ? ఏమా కథ? లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం ట్రాన్సిట్ హాల్ట్ లో ఆ బాబు నడిపిన బాగోతమేమిటి? ప్రస్తుతం ఎయిర్ లైన్స్ ఆఫీసుల్లో చక్కర్లు కొడుతున్న ఆ బాబు కథ వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా 30 కి పైగా తోటి మహిళా ప్రయాణీకురాలి ఫోటోలను తన మొబైల్ లో అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించిన ఈ బాబు యవ్వారం చూసిన మిగిలిన ప్రయాణీకులు ఆ యువతికి, ఆమె తండ్రికి విషయం చెప్పటంతో. విమానంలో కాస్తంత ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఇదంతా ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్ట్ లో ట్రాన్సిట్ కోసం ఆగినప్పుడు ఆ యువతి కాస్తంత కునుకు తీస్తుంటే మన హైదరాబాదీ బాబు చేసిన నిర్వాకమన్నమాట.

సరే ఇదే విషయంపై ఎయిర్ హోస్టెస్ కి ఫిర్యాదు చేస్తే, ఆ జర్మన్ ఎయిర్ హోస్టెస్ కాస్తా లైట్ తీసుకోమని ఆ యువతికి ఉచిత సలహా ఇచ్చిందట. అదేమని నిలదీస్తే, ఎక్కువ సీన్ క్రియేట్ చేస్తే విమానం నుంచి దింపేస్తామని హెచ్చరించిందట. అంతే కాకుండా ఆ హైదరాబాదీ మొబైల్ నుంచి ఫోటో లు డిలీట్ చేయించిందట. ఆ బాబు మాత్రం తక్కువ తిన్నాడా ,అసలు నాకేం తెలీదు పొమ్మన్నాట్ట!

 

Passport

చివరకు పోలీస్ కంప్లైంట్ ఇస్తామని బెదిరించటంతో, ముంబై లో దిగిన తర్వాత ఆ బాబు లిఖిత పూర్వక క్షమాపణ రాసిచ్చాడట!   కొసమెరుపేమిటంటే , ఈ సీన్ జరుగుతున్నప్పుడు ఆ హైదరాబాదీ తల్లిదండ్రులు కూడా ఫ్లయిట్ లో తంతును మౌనంగా వీక్షించటం పైగా తమ కొడుకుని వెనకేసుకురావటం. ఇవన్నీ చూస్తుంటే, ఫ్లైట్ జర్నీ లో కూడా మహిళలకు వేధింపులు తప్పవన్నట్టే నా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ముంబై లో ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పి లెంపలేసుకున్న హైదరాబాదీ మాత్రం ఆ తర్వాత నుంచీ తన అడ్రెస్ మార్చుకుని తిరుగుతున్నాడట. ఎక్కడ పోలీసుల కంట బడితే నిర్భయ చట్టం కింద కేసు పెడతారేమో ననే భయంతో ! ఆ హైదరాబాదీ పాస్ పోర్ట్  ప్రకారం అతడి ప్లేస్ ఆఫ్ బర్త్—-రామగుండం, ఈ ఒక్క ఆధారం చాలు కదా పోలీసులకు, అతడిని ట్రేస్ అవుట్ చేయటానికి!

(Visited 56 times, 1 visits today)