ఈవీఎంలు తరలిస్తున్న భద్రతాసిబ్బందికి చెందిన ఏకే47 తుపాకిని గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన విజయనగరంలో కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల నిమిత్తమై ఒడిశాకి ఈవీఎంలను లారీలో తరలిస్తున్నారు. శనివారం వేకువజామున నాతవలస టోల్‌గేట్ వద్దకి లారీ చేరుకుంది.
భద్రతాసిబ్బంది విశ్రాంతి కోసమని టోల్‌గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్లి హైవే పక్కన లారిని ఆపారు. సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి ఏకే 47 తుపాకిని దొంగిలించారు.
ఆ తుపాకి అభిమన్యు సహూ అనే భద్రతా సిబ్బందిదిగా గుర్తించారు. దీంతో భద్రతా దళాలు బోగాపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏఎస్సీ ఆధ్యర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.