Home / Entertainment / ఇపుడు ప్రతిభ ఉన్న టాప్ హీరోలు లేరు..!

ఇపుడు ప్రతిభ ఉన్న టాప్ హీరోలు లేరు..!

Author:

“డైనమెట్” మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేసాడు. “ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో అనేది ఆ హీరోల సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ను బట్టి నిర్ణయించబడుతోందనీ కేవల ఆ హీరో సినిమా చేసే బిజినెస్ ని బట్టి ఆ నటుని స్థాయిని నిర్ణయిస్తున్నారని స్టేటస్ నిర్ణయించే కొలమానంగా అదేవిధంగా ఆ హీరోలు నటించిన సినిమాలకు ఎంత బిజినెస్ జరిగింది అన్న లెక్కలు ప్రాతిపదికగా హీరోల స్థాయిని నిర్ణయిస్తూ ఉండటంతో హీరోల ప్రతిభకు గుర్తింపు లేకుండా పోతోందనీ” వివాదాస్పద వ్యాఖ్యల తో కొత్త దుమారానికి తెర తీసాడు మంచు విష్ణు.

మొదటి నుంచీ ఇలాంటి అంశాలే ప్రాతిపదికగా గనక తీసుకుంటే టాలీవుడ్ సినిమా రంగ చరిత్రలో గొప్ప నటులుగా పేరు గాంచిన ఎస్.వి.రంగారావు, రాజనాల లాంటి ఒకనాటి స్టార్స్ కు గుర్తింపు వచ్చేదా అని మంచు విష్ణు ఆవేశంగా అన్నాడు. అంతేకాదు ఎంత టాప్ హీరో అయినా విజయాలతో పాటు పరాజయాలు కూడ తప్పదనీ ప్రతీ కెరీర్ లోను ఓడిదుడుకులు ఉంటాయని…. తన తండ్రి మోహన్ బాబు, నందమూరి సింహం బాలకృష్ణ లాంటి నటులకు వచ్చినన్ని సూపర్ సక్సెస్ లూ సూపర్ ఫ్లాప్ లు మరి ఏ హీరోకి రాలేదు ఐనా ఇప్పటికీ వారు నిలబడ్డారు అంటే వారి ప్రతిభే కదా కారణం, కానీ ఇప్పుడా పరిస్తితి లేదు అని అన్నాడు .

దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన ‘డైనమైట్’ గతవారం విడుదలై ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది ఐనప్పటికీ నటుడిగా మంచు విష్ణు కు మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమా కి ఫ్లాప్ టాక్ రావటం తో మంచు విష్ణు కష్టమంతా వృధా అయింది. ఐనా కూడా ఈ సినిమాను చూసిన ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ‘డైనమైట్’ హాలీవుడ్ స్థాయిలో ఉంది అని డైనమెట్ ని పొగుడుతూ చెప్పిన మాటలను చూస్తూ ఉంటే ఏదోవిధంగా ఈసినిమాను నిలబెట్టాలని మంచు విష్ణు తన వంతు ప్రయత్నాలు ఇంకా చేస్తున్నట్లే కనిపిస్తోంది. కానీ డైనమెట్ ఫ్లాప్ ని ఎప్పటి లాగే స్పోర్టివ్ గా తీసుకున్నమంచు విష్ణు . మళ్ళీ అత్మవిస్వాసం తో ఎటువంటి నిరాశకూ గురి కాకుండా లవ్ యాక్షన్ రెండూ సమపాళ్ళలో ఉండే మరో కొత్త సినిమా కోసం సిద్దం ఔవుతున్నాడు. కార్తిక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘జాదుగాడు’ సినిమా ద్వారా పరిచయం అయిన సోనారిక ఈసినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. తనొక మాస్, యాక్షన్ సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకోవాలన్న మంచు విష్ణు  డ్రీమ్ ఈ రాబోయే సినిమా అయినా తీరుస్తుందేమో చూడాలి..

(Visited 120 times, 1 visits today)