Home / Inspiring Stories / ఈ వంద నోటుతో జాగ్రత్తగా ఉండండి…!

ఈ వంద నోటుతో జాగ్రత్తగా ఉండండి…!

Author:

అచ్చం వంద రూపాయల నోటులాగానే ఉంటుంది కానీ అది నకిలీ నోటు, రిజర్వ్ బ్యాంకు ముంద్రించిన నోటుకి ఏమాత్రం తీసిపోకుండా అదే క్వాలిటీతో ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులు.. చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. వంద రూపాయల నోట్లుపై ఆర్బీఐ గవర్నర్ సంతకం బదులు సాంటాక్లాజ్ పేరుతో సంతకం ఉంది. అంతే కాదు కింద వన్ హడ్రెడ్ కూపన్ అనే పేరు కూడా ఉంది. ఈ నకిలీ వంద రూపాయల నోట్లు ఇప్పుడు ముంబై లో హల్ చల్ చేస్తున్నాయి.

రెండు రోజుల క్రితం మేఘ చక్రవర్తి అనే బాలీవుడ్ నటికి అర్ధరాత్రి ఒక ఆటోవాలా ఒక వంద రూపాయల నోటు ఇచ్చాడు, అర్థరాత్రి సమయంలో వంద నోటు అని చూసుకుంది కానీ.. పరీక్షించి చూడలేదు. తర్వాత రోజు ఆ నోటుని మరొకరికి ఇస్తే.. వాళ్లు పై నుంచి కిందకు చూశారంట. అప్పుడుగానీ అర్థం కాలేదు.. అది నకిలీ నోటు అని, ఆ ఆటోవాలా చేతిలో మోసపోయానని వంద నోటు విషయంలో జాగ్రత్తగా ఉండండి అని సోషల్ మీడియాలో చెప్పొకొచ్చింది.

fake-hundred-note

ప్రతి షాపులో వంద రూపాయలతోనే ఎక్కువ లావాదేవీలు జరుగుతాయి కావున ఎవరైనా వంద రూపాయలని మడిచి ఇస్తే వెంటనే జేబులో పెట్టేసుకుంటారు, ఇప్పటినుండి అలా చేయకండి దానిని జాగ్రత్తగా పరిశీలించి తీసుకోండి. ఇప్పటికైతే ముంబై లోనే ఉన్న ఈ దొంగ నోట్లు మన దగ్గరికి కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచింది.

(Visited 1,866 times, 1 visits today)