Home / Inspiring Stories / రైతుల దగ్గర కిలో ఉల్లిపాయలని 50 పైసలకి కొని మనకు 30 రూపాయలకు అమ్ముతున్నారు.

రైతుల దగ్గర కిలో ఉల్లిపాయలని 50 పైసలకి కొని మనకు 30 రూపాయలకు అమ్ముతున్నారు.

Author:

అది మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని గంగాపూర్,అక్కడే నివాసం ఉండే అతని పేరు రవీంద్ర మాధికర్, వయసు కనీసం 30 ఏళ్లు కూడా లేవు. గంగాపూర్ ఆ చుట్టూ పక్కల ప్రాంతపు ప్రజలు ఆ దగ్గర ఉన్న కరువు ప్రాంతమైన మరఠ్ వాడలో అతి పెద్ద హోల్ సేట్ మార్కెట్ ‘లాసూర్’ కి తాము పండించిన పంటలు తెచ్చి అమ్ముతుంటారు,అక్కడ ఎక్కువగా దళారులకు ఉల్లిపాయలు అమ్ముతుంటారు.

Agriculture labors busy filling onions into bags to export them to market, near Chief minister's residence in Undavalli of Amaravati on Wednesday. The crop was cultivated after the land pooling was started. They selling onions to market for Rs.10 per kg, and now the market price is Rs.20 per kg.

రవీంద్ర మాధికర్ అనే రైతు కూడా ఆ హోల్ సేల్ మార్కెట్ కి తన ఉల్లిపాయ పంటని తీసుకొచ్చాడు. సుమారుగా ఆ రోజు అతను తీసుకొచ్చిన సరుకు 450 కిలోల .అది అమ్మగా అతనికి వచ్చిన ఆదాయం ఎంతో ఊహించగలరా ? కేవలం రూ.175 మాత్రమే. ఆ డబ్బులు చేతిలో పట్టుకుని చాలా దీనంగా చూశాడు రవీంద్ర, విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించి రవీంద్ర ని అడగగా ఉల్లిపాయ పంట వేసినప్పటి నుంచి ఎరువలకి,పంట చేతికి వచ్చాక వాటిని మార్కెట్ కి తరలించడం వరకు అయిన ఖర్చు, అంతకి మించి ఎండకీ ,వానకీ పనిచేసిన కష్టానికి ప్రతిఫలంగా రూ.175 అని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని తన బాధని వ్యక్తం చేశాడు .

An Indian onion vendor waits for customers under the shade of an umbrella at a weekend market in Chennai on April 22, 2016. / AFP PHOTO / ARUN SANKAR

అతను మార్కెట్లో కనిపించిన ఓ మీడియా విలేకరితో ‘రైతులు ఆత్మహత్య చేసుకోవాలన్నంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంటారో నాకు ఇంతక ముందు అర్ధం అయ్యేది కాదు, అంత అవసరం ఎముంటుందా అనుకునేవాణ్ని,నాకు ఇప్పుడర్ధమైంది. నాక్కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది’ అంటూ దీనంగా చెప్పాడు.

There has been a decline in vegetable price over the past few days including that of onions which came down to one fourth of its price a few days ago.

ఇప్పుడక్కడ ఉల్లిపాయల రేట్లు భారీగా పడిపోయాయి. మంచి రకానికి చెందిన వంద కిలోల ఉల్లిపాయలు 500-600 రూపాయలు పలుకుతున్నాయి. నాసిక్ లో మరొక పెద్ద ఉల్లిపాయల మార్కెట్ లాసల్గాన్ లో ఉంది. అక్కడ క్వింటాల్ ఉల్లిపాయలు రూ.720 పలుకుతున్నాయి. మామూలుగా ఒక ఎకరాలో ఉల్లిపాయల్ని పండించడానికి సగటున రైతుకి రూ.50,000 నుంచి రూ.80,000 ఖర్చవుతాయి . లాభాల సంగతీ ,పోనీ పెట్ట్టుబడులు సంగతీ అటుంచి వచ్చే ఆదాయం రాను పోను బాడిగలకి,కూలీల వేతనాలకి కూడా సరిపోవటం లేదు ,దీనితో అక్కడి రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు , ఇంకా మార్కెట్ లో దళారులు కూడా రైతులను దారుణంగా మోసం చేస్తున్నారు, రైతుల దగ్గర 50 పైసలకు కొని బయట మార్కెట్ లో 20 నుండి 30 వరకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం వీళ్ళని ఓ కంట కనిపెట్టి సబ్సిడీలు కలిపించి ,దళారీల నిరంకుశత్వాన్ని అదుపులో ఉంచితే అన్నం పెట్టే రైతన్నని కాపాడుకోవచ్చు,

(Visited 592 times, 1 visits today)