Home / Latest Alajadi / దేశానికి అన్నం పెట్టె రైతు చేతులకి సంకెళ్లు..!

దేశానికి అన్నం పెట్టె రైతు చేతులకి సంకెళ్లు..!

Author:

మన దేశంలోనే కాదు ఏ దేశంలో అయిన రైతు చేతులు మట్టిలోకి వెళ్తేనే మన ఆకలి తీరుతుంది, అలాంటి రైతుల చేతులకి సంకెళ్లు పడటం, అదికూడా మాది రైతుల ప్రభుత్వం అని చెప్పుకొనే తెలంగాణ రాష్ట్రంలో జరగడం అందరికి విస్మయం కలిగించింది, ఖమ్మం మార్కెట్ యార్డులో తాము ఆరుగాలం పండించిన పంటకి అధికారులు, దళారులు కుమ్మక్కై సరైన ధర చెల్లించట్లేరని ఆగ్రహించిన రైతులు మార్కెట్ యార్డులో కుర్చీలు, బల్లలు విరగొట్టి నిరసన తెలిపారు, అప్పటికే చాలా పంటలకు మద్దతు ధర దక్కక, సరైన కొనుగోళ్లు సాగక ఆందోళనలో ఉన్న రైతులు అధికారుల చేష్టలకి ఆగ్రహం చెంది మార్కెట్ యార్డుని ధ్వంసం చేసారు, మార్కెట్ యార్డు ధ్వంసం చేసినందుకు కొంతమంది రైతులని పోలీసులు ఆరెస్ట్ చేసారు.

Farmers Handcuffed by Police

ఆ రైతులని నిన్న కోర్టుకి తీసుకొచ్చేటప్పుడు పెద్ద పెద్ద క్రిమినల్స్, ఉగ్రవాదులని తీసుకొచ్చినట్టు చేతులకి ఇనుప సంకెళ్లు వేసి పోలీసులు తీసుకవచ్చారు, దేశానికి అన్నం పెట్టె రైతులని పోలీసులు అత్యుత్సాహంతో బేడీలు వేసి తీసుకరావడం సంచలనం సృష్టించింది, పోలీసుల చర్యను తెలంగాణ సమాజం మొత్తం నిరసనని వ్యక్తం చేసింది, దాడి చేసింది రైతులు కాదు రైతుల ముసుగులో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు చేసారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసిఆర్ గారే చెప్పారు కానీ ఇప్పటివరకు ఒక్కరిని ఆరెస్ట్ చేయలేదు కానీ పంటని అమ్ముకుందాం అని వచ్చిన అమాయకపు రైతులని ఆరెస్ట్ చేసారు, అధికారులు,దళారులలతో కుమ్మక్కై పంట ధరని తగ్గిస్తుంటుంటే ఏమి చేయని ప్రభుత్వం, పోలీసులు పండించిన పంటని అమ్ముకోలేక బక్క చిక్కిన రైతులని ఇలా ఆరెస్ట్ చేసి అవమానించడం చాలా విషాదకరం..!


రైతులకి సంకెళ్లు వేయటంపై సర్వత్రా విమర్శలు రావటంతో తెలంగాణ ప్రభుత్వం ద్దిద్దుబాటు చర్యలు చేపట్టింది, ఇప్పటికే ఇద్దరు పోలీసులని సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకి ఆదేశించామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు.

(Visited 197 times, 1 visits today)