Home / Entertainment / బాక్స్ ఆఫీస్ కూడా ఫిదా అయిపోయింది.

బాక్స్ ఆఫీస్ కూడా ఫిదా అయిపోయింది.

Author:

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు, సినిమా విడుదల అయిన మూడోవారంలో కూడా ఫిదా కలెక్షన్స్ అదిరిపోయేలా ఉండటం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా స్టామినాని తెలియజేస్తుంది, ఎటువంటి అంచనాలు లేకుండా జులై 21 న విడుదల అయిన ఫిదా డబల్ బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది, ఫిదా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకి పైనే గ్రాస్ ని కొల్లగొట్టింది. అమెరికాలో 2 మిలియన్ డాలర్ల (రూ.12 కోట్లు) బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.

ఫిదా కలెక్షన్స్

ఫిదా సినిమాకి ముఖ్యంగా భానుమతి క్యారెక్టర్ కి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు, సాయి పల్లవి, వరుణ్ తేజ్ ల పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయి సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు, సినిమాలోని లొకేషన్లు, డైలాగ్లు, పాటలు అన్ని ప్రేక్షకులని ఫిదా చేసేశాయి అందుకే సినిమా విడుదల అయి 3 వారాలు అయిన ప్రేక్షకులు సినిమాని చూస్తున్నారు, ఇదే మాములు సినిమాకి మంచి సినిమాకి ఉన్న తేడా, రూ.18 కోట్లకి అమ్ముడై రూ.40 కోట్ల షేర్, రూ.60 కోట్ల గ్రాస్ కొల్లకొట్టి వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల కెరీర్ లో పెద్ద సినిమాగా నిలిచి ప్రొడ్యూసర్లకి, సినిమా కొన్నవాళ్ళకి డబల్ ప్రాఫిట్ తెచ్చింది. అలాగే ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా మంచి స్టోరీతో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఫిదా నిరూపించింది.

 Fidaa Box Office Collections :

Nizam – 14.02 Cr

Ceded – 3.13 Cr

Nellore – 0.78 Cr

Guntur – 2.10 Cr

Krishna – 1.78 Cr

East – 1.89 Cr

West – 1.36 Cr

Vizag – 3.44 Cr

Fidaa Box Office Collections (AP + TS) – 28.50 Cr

Fidaa Collections USA – 12.2 Cr

Karnataka Collections – 2.o Cr

Remaining Collections – 1.0 Cr

Fidaa Movie Total Collections : 43.70 Cr

(Visited 1,539 times, 1 visits today)