Home / Reviews / ఫిదా రివ్యూ & రేటింగ్.

ఫిదా రివ్యూ & రేటింగ్.

ఫిదా రివ్యూ

Alajadi Rating

3/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: వరుణ్ తేజ్, సాయి పల్లవి, సాయిచంద్ ,రాజా ,సత్యం రాజేష్..తదితరులు

Directed by: శేఖర్ కమ్ముల

Produced by: దిల్ రాజు

Banner: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

Music Composed by: శక్తి కాంత్

శేఖ‌ర్ క‌మ్ముల‌ తీసింది కొన్ని సినిమాలే అయినా  ప్రేక్ష‌కుల‌పై త‌న‌దైన ఓ ప్ర‌త్యేక‌ ముద్ర వేశారు . ఆయ‌న  సినిమాలు చాలా నిజాయ‌తీగా, మ‌న జీవితాల్ని పోలిన‌ట్టుగా  ఉంటాయి. చూశాక ఒక మంచి అనుభూతిని క‌లిగిస్తాయి. కొన్ని  ప‌రాజ‌యాల త‌ర్వాత…  కొంత‌కాలం పాటు  విరామం తీసుకొని శేఖర్ కమ్ముల ఎంతో నమ్మకంతో తీసిన సినిమా ” ఫిదా ” , వరుణ్ తేజ్, సాయి పల్లవిలతో ఒక సరికొత్త ప్రేమకథాని ఫిదా రూపంలో అందించబోతున్నట్లుగా శేఖర్ కమ్ముల ఎంతో నమ్మకంగా చెప్పారు, దిల్ రాజు నిర్మాణంతో తెరకెక్కిన ఫిదా సినిమా ఈరోజు విడుదల అయింది, శేఖర్ కమ్ముల అన్నట్లుగా ఈ సినిమాకి అందరు ఫిదా అయ్యారా..? లేదా..? తెలుసుకోండి.

కథ:

అమెరికాలో చదువుతున్న వరుణ్ (వరుణ్ తేజ్) తన అన్నయ్య పెళ్లి కోసం తెలంగాణలోని ఓ పల్లెటూరికి వస్తాడు. అక్కడ పెళ్లి కూతురి చెల్లలు భానుమతి (సాయి పల్లవి)తో  వరుణ్ కు స్నేహం కుదురుతుంది, ఆమెను ఇష్టపడుతుంటాడు, పెళ్లయ్యే లోపు వరుణ్ భానుకి బాగా నచ్చేస్తాడు, కానీ భానుమతికి ఊరంటే చాలా ఇష్టం, వరుణ్ ఆలోచనలు వేరు. కెరీర్‌, అమెరికా అంటూ ఆలోచిస్తుంటాడు. పెళ్లి తరువాత కొన్ని కారణాల వల్ల ఇద్దరు దూరం అవుతారు, ఇంతలో భానుమతికి పెళ్లి ఫిక్స్ అవుతుంది, మరి భానుమతి, వరుణ్ మళ్ళీ కలిసారా..? వాళ్లిద్దరూ ఎందుకు దూరం అయ్యారు..? భానుమతి పెళ్లి ఎవరితో అయింది.? వీళ్లిద్దరి జీవితాలు చివరికి ఎలాంటి మలుపు తీసుకున్నాయి..? అనేది తెరమీదే చూడాలి.

అలజడి విశ్లేషణ:

శేఖ‌ర్ క‌మ్ముల శైలి ఫీల్ గుడ్ సినిమా ఇది. కొన్ని జీవితాల్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన అనుభూతి క‌లుగుతుంది. తెర‌పై క‌నిపించే స‌న్నివేశాలు మ‌న ఇంట్లోనో, మ‌న ప‌క్కింట్లోనే జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల్లా అనిపిస్తాయి. తొలి స‌గ‌భాగం క‌థ‌లో పెద్ద‌గా మ‌లుపులేమీ ఉండ‌వు. క‌థ బాన్సువాడ చేరాక వేగం అందుకొంటుంది. ఆ త‌ర్వాత వ‌చ్చే పాత్ర‌లు స‌హ‌జంగా సంద‌డి చేయ‌డం, సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకొనేలా ఉండ‌టంతో సినిమా స‌ర‌దాగా సాగిపోతుంది.

ద్వితీయార్ధంలోనే క‌థ మ‌న‌సుకి హ‌త్తుకొంటుంది. వ‌రుణ్‌, భానుమ‌తి మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు… జీవితంలో ప్రతి అమ్మాయి ఎదుర్కునే సంఘ‌ర్ష‌ణని ఆక‌ట్టుకొనేలా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ప‌తాక స‌న్నివేశాల్లో మాత్రం ఆ బిగి కాస్త‌ త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. సినిమాకి తెలంగాణ యాస బలంగా నిలిచింది, కొన్ని సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడంతో ‘ఫిదా’ మీద అంతకుముందున్న ఇంప్రెషన్ కొంచెం తగ్గుతుంది. ఐతే ద్వితీయార్ధం నిరాశ పరిచినప్పటికీ.. మరీ భారంగా అయితే అనిపించదు. కొన్ని ప్రతికూతలున్నప్పటికీ ‘ఫిదా’ ప్రత్యేకమైన సినిమానే. ఇందులోని ఎంటర్టైన్మెంట్.. ఫ్యామిలీ ఎమోషన్లు అన్ని వర్గాల ప్రేక్షకులకూ బాగానే కనెక్టయ్యే అవకాశముంది.

ప్లస్ పాయింట్స్ :

  • వ‌రుణ్, సాయిప‌ల్ల‌వి న‌ట‌న
  • డైలాగ్స్
  • మ్యూజిక్, కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్ :

  • కొన్ని సన్నివేశాలు
  • క్లైమాక్స్

పంచ్ లైన్ : వచ్చిందే… ‘ ఫిదా ‘ చేసే సినిమా వచ్చిందే…!

(Visited 2,027 times, 1 visits today)